ఏపీ రాజధానిగా అమరావతిని మార్చొద్దంటూ దాదాపు 20 రోజులుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ఆందోళనలు ఆ 29 గ్రామాలకు.. అందులోనూ ప్రధానంగా వెలగపూడి, మందడం, తుళ్లూరు, రాయపూడి వంటి నాలుగైదు గ్రామాలకే పరిమితం అవుతున్నాయి. దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. సానుకూల వాతావరణ కనిపించడం లేదు.

 

ఈ నేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. సోమవారం రైతులంతా పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. మంగళవారం మహాధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ తమ ఆందోళనల్లో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అమరావతి రైతులు తాజాగా మోహన్ బాబు.. కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారట. అదేంటి.. రాజధాని మార్పుకూ మోహన్ బాబుకూ లింకేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు రాజకీయం.

 

సోమవారం మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడం సబబేనని మోహన్ బాబు మోడీతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జగన్ ప్రతిపాదనను సినీ పరిశ్రమ స్వాగతిస్తోంది. అమరావతి కంటే.. విశాఖ రాజధాని కావడం సినీ పరిశ్రమకు మేలు.

 

ఇప్పటికే విశాఖలో సినిమా షూటింగులు సర్వసాధారణంగా మారాయి. అందుకే జగన్ విశాఖ ప్రతిపాదన సబబేనని.. మోడీ వద్ద మోహన్ బాబు చెప్పారట. ఇలా అమరావతికి వ్యతిరేకంగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నాడని అమరావతి రైతులు కోపంగా ఉన్నారట. అందుకే తమ నిరసనల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారుట. అయితే మోహన్ బాబును మోదీ వద్దకు చిరంజీవి రాయబారం పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఖాయం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖకు రాజధాని తరలింపు విషయంలో కేంద్రం అడ్డుపడకుండా చూసేందుకు ఈ లాబీయింగ్ జరిగినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: