పేటీఎం.. ఈ చెల్లింపుల యాప్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గర నుంచి బజ్జీల కొట్టువాడి వరకూ అంతా పేటీమ్ వాడకానికి అలవాటు పడ్డారు. జేబులో డబ్బు లేకపోయినా.. మొబైల్ ఉంటే చాలు.. ఎక్కడైనా ఏమైనా కొనేయొచ్చు అనే రేంజ్ లో పే టీఎం పాపులర్ అయ్యింది.

 

అయితే ఇప్పుడు ఈ చెల్లింపుల రంగంలోనూ పోటీ బాగా ఎక్కువైంది. అందుకే ఇప్పుడు పేటీ ఎం కొత్త సర్వీసుల వైపు చూస్తోంది. సేవలను విస్తరిస్తోంది. త్వరలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. ఇందుకోసం ఆ సంస్థకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతులు కూడా తీసుకుందట. ఈ వివరాల్ని ఆ సంస్థ తమ ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

 

పేటీఎం ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంలో 3 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ సంస్థ మ్యూచువల్‌ ఫండ్ సర్వీసులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షేర్ మార్కెట్ సర్వీలు కూడా అందించబోతోందట. ‘స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు చూస్తున్నాం. నిర్వహణ, ఆపరేషన్లు తదితర అంశాలపై మా బృందం స్టాక్‌ ఎక్స్చేంజీలను సంప్రదించింది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం’ అని పేటీఎం సంస్థ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈక్విటీ, క్యాష్‌ సెగ్‌మెంట్‌, డెరివేటివ్స్‌, ఈటీఎఫ్‌లలో పేటీఎం మనీ ట్రేడింగ్‌ను పేటీఎం ఆఫర్‌ చేస్తుందట.

 

అంతే కాదు.. పేటీఎం మనీ షేర్‌ ట్రేడింగ్‌తో పాటు జాతీయ పింఛను సేవలను కూడా అందించబోతోందట. ఇందుకోసం పింఛను నిధుల నియంత్రణ అభివృద్ధి సంస్థ పీఎఫ్‌ఆర్‌డీ నుంచి కూడా పర్మిషన్ తీసుకుందట. ఇలా ఒక్కొక్కటిగా తమ సేవలను విస్తరించాలని పే టీఎమ్ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం పే టీమ్ సర్వీసులకు పోటీగా గూగుల్ పే, పే ఫోన్ వంటి చెల్లింపు సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఆ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. అందుకే తనకు ఉన్న కస్టమర్లకు కొత్త సర్వీసులు అందించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది పే టీఎం సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: