చాలామంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుందని తెలిసినా.. ఏమాత్రం ఖాతరు చేయకుండా అలానే భద్రత లేకుండా రోడ్లపైకి రయ్, రయ్ మని వచ్చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వీళ్ళకి హెల్మెట్ ధరించమని చెప్పలేక ఎంతో విసుగుపోతుంటారు. సాధారణంగా కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇస్తూ ఫైన్లు వేస్తూ ఉంటారు పోలీసులు. కానీ ఒక ట్రాఫిక్ ఎస్ఐ హెల్మెట్ ధరించమని ఒక అతనికి ఎంతో గారాబంగా సొంత కొడుకుకు చెప్పినట్టు చెబితే అది ఒక గొప్ప విషయమని మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన మాదాపూర్ లో జరిగే వైరల్ అవుతుంది.


వివరాల్లోకి వెళితే ఒక జంట ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ వారిని ఆపాడు. ఆ తర్వాత మాట్లాడుతూ... ' అమ్మ వెనుక నువ్వు కూర్చున్నావ్ ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే నీకు కూడా దెబ్బ తాకిద్ది కదా?'


డ్రైవింగ్ చేసే అతడ్ని ఉద్దేశిస్తూ... 'ప్లీజ్ అర్థం చేసుకో బిడ్డ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏం కొంపలు మునగవ్. బరువేం కాదుగా ఎందుకు హెల్మెట్ పెట్టుకోవు? చెయ్యి విరిగితే అతుకుతుంది. కాలు విరిగితే అతుకుతోంది. కానీ తలకు తగిలితే డేంజర్ బిడ్డ.. చెప్పలేం కోమాలోకి వెళ్లి పోవచ్చు. చిన్న చిన్న ప్రమాదాలు వలన కోమా లోకి వెళ్ళిపోవచ్చు. చెప్పేది నీ మంచి కోసమే కదా బిడ్డ' అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వ్యక్తికి వివరించాడు.


ఆ తర్వాత ఏమనుకోకు బిడ్డ, ఒక ఫైన్ ఉంటుంది మూడు వందలు కట్టి జాగ్రత్తగా వెళ్ళండని, మీ భర్తకు ఒక హెల్మెట్ కోనివ్వు బిడ్డ అంటూ చాలా గౌరవంగా చెప్పి పంపేంచిసాడు ఎస్ఐ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంట వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: