ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ ఉంటాం వేస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు బ్యాంకు ముఖ్యమే.  

                      

అయితే ఒక్కోసారి ఊహించని విధంగా బ్యాంకు సెలవలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ కస్టమర్లకు మొన్న హై అలెర్ట్ ప్రకటించారు. రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు అన్ని బంద్.. బ్యాంకులు సమ్మెకు సిద్ధం అయ్యారు. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలే... వాటిని బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తు ఈ సమ్మెకు దిగుతున్నాయి. 

                  

అయితే కేవలం బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొనబోతున్నారు. అందుకే రేపు జనవరి 8న బ్యాంకింగ్ సేవలు అన్ని ఆగిపోనున్నాయి. అలాగే ఏటీఎం సర్వీసులపై కూడా ఎక్కువ ప్రభావం పడనుంది. అందుకే బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దీనికి అనుగుణంగా బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకోవడం ఎంతో మంచిది. 

                        

కాగా ఈ స్ట్రైక్ కి వివిధ బ్యాంకుల నుండి ఇప్పటికే మద్దతు వచ్చింది. అందుకే రేపు ఏమైనా బ్యాంకు పనులు ఉన్న ఈరోజే పూర్తి చేసుకోవడం మంచిది. అంతేకాదు ఈ బ్యాంకు సమ్మె కారణంగా ఏటీఎంలపై కూడా ప్రభావం పడనుంది. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోండి. చివరి నిమిషాల్లో ఇబ్బందులు పడకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: