వైసిపి ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం జరిగింది. చినకాకాని నుండి కాజావైపు కారులో వస్తున్న  ఎంఎల్ఏపై చెక్ పోస్టు దగ్గర  ఒక్కసారిగా కర్రలు, ఇనుప రాడ్లతో  దాడి  జరిగింది.  రాజధాని అమరావతిని తరలింపుకు సంబంధించిన విషయంలోనే  ఎంఎల్ఏ పై దాడి జరిగిందని అర్ధమవుతోంది. రైతుల ముసుగులో  టిడిపి గుండాలే తనపై దాడి చేసినట్లు ఎంఎల్ఏ ఆరోపించటం సంచలనంగా మారింది.

 

నేషనల్ హై వే పై ఉన్న కాజా టోల్ గేటు దగ్గరకు రాగానే పెన్నెల్లి కారును ఆపారు. వెంటనే రెండు వైపుల నుండి ఒక్కసారిగా జనాలు ఎంఎల్ఏ కారుపైకి దూసుకువచ్చారు. తమ కార్లకు రెండు వైపుల నుండి జనాలు కర్రలు, ఇనుప రాడ్లను తీసుకొచ్చి దాడి చేయబోతున్నట్లు గమనించగానే భద్రతా సిబ్బంది వెంటనే తమ కారులో నుండి దిగి ఎంఎల్ఏ కారుకు రెండు వైపులా నిలబడ్డారు.

 

ఎప్పుడైతే ఆందోళనకారులు ఎంఎల్ఏ కారు దగ్గరకు చేరుకున్నారో వెంటనే భద్రతా సిబ్బందిపైకి దాడి చేశారు. అదే సమయంలో ఎంఎల్ఏ కారుపైన కూడా ఆందోళనకారులు దాడి చేశారు. దాడిలో రెండు కార్లు కూడా ధ్వసమైపోయాయి. కార్ల అద్దాలు పగిలిపోయి కారు బాడి సొట్టలు పడిపోయింది.  దాదాపు 20 నిముషాల పాటు జరిగిన ఈ దాడిలో చుట్టుపక్కల వాళ్ళకు అసలు ఏమి జరుగుతోందో కూడా అర్ధం కాలేదు.

 

ఇదే విషయమై పిన్నెల్లి మాట్లాడుతూ తనపై టిడిపి గుండాలను పంపి హత్య చేయించటానికి చంద్రబాబునాయుడే కుట్ర చేసినట్లు ఆరోపించారు. అమరావతి తరలింపును అడ్డుకునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమే తనపై దాడిగా పిన్నెల్లి అనుమానించారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేదని కేంద్రానికి తెలియజేయటమే చంద్రబాబు ఉద్దేశ్యంగా తనకు అనుమానంగా ఉందని మరో ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమే ధ్యేయంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నట్లు reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి ఆరోపించారు. మరి ఈ దాడి విషయం ఎంత దూరం వెళుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: