నేడు  చరిత్రలో ఎన్నో సంఘటనలు... ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది మహనీయుల మరణాలు జరిగాయి . మరి చరిత్రలో జనవరి 11 న  అసలేం జరిగింది అసలేం జరిగిందో తెలుసు కుందాం రండి . 

 

 ఏపీఎస్ఆర్టీసీ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1959 జనవరి 11వ తేదీన ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలందరికీ రవాణా సేవలు అందించింది . ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీఎస్ఆర్టీసీ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గా రోడ్డు రవాణా సంస్థలు విడిపోయాయి. ఇకపోతూ 1932 సంవత్సరంలోనే  నిజాం ప్రభుత్వం సుమారు 4 లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులు 166 మంది సిబ్బందితో ట్రాన్స్ పోర్టు సంస్థను నెలకొల్పినది.  అది నిజం రైల్వే లో భాగంగా ఉండేది. 

 


 నీలం సంజీవరెడ్డి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవీ విరమణ పొందారు. 1986 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా పదవి విరమణ అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకరం చేశారు. 1960 జనవరి 11 1962 మార్చి 29 వరకు నీలం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి గా కొనసాగారు. 

 

 

 రాహుల్ ద్రవిడ్ జననం : 1973 జనవరి 1న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ ద్రావిడ్ జన్మించారు. 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్ ద్రవిడ్ . ప్రపంచంలోనే టాప్10 దిగ్గజ క్రికెటర్ లలో ఒకరు రాహుల్ ద్రవిడ్ . అద్భుతమైన ఆట ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోనే దిగ్గజ  క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టుకు అందించిన సేవలను ఇప్పటికీ ప్రేక్షకులు మరువలేరు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ స్ట్రైక్   అగ్రస్థానంలో ఉంది . తన సారథ్యంలో జట్టును ముందుకు తీసుకెళ్తూ ఎన్నో విజయాలను భారత్ కి సొంతం చేశారు రాహుల్ ద్రావిడ్. టేస్ట్ మ్యాచుల్లో పది వేల పరుగుల మైలురాయిని అధిగమించిన దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ . ఇంగ్లాండ్ పై లార్డ్స్  మైదానంలో తొలి టెస్ట్ ఆడిన రాహుల్ ద్రావిడ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ దిగ్గజ క్రికెటర్ గా మారిపోయాడు. నేటి తరం యువ ఆటగాళ్ల కోసం ఎన్నో రికార్డులు నెలకొల్పాడు రాహుల్  ద్రవిడ్.

 

 రాహుల్ ద్రవిడ్ ఆట ఇప్పటికి ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా ఉంటుంది. దూకుడుకు మారుపేరుగా రాహుల్ ద్రవిడ్  ఉండేవారు. ఎన్నోసార్లు భారీ స్కోరును నమోదు జట్టుకు భారీ విజయాలను సైతం అందించారు రాహుల్ ద్రావిడ్. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ఇండియన్  అండర్-19 టీంకి  కోచ్ గా  వ్యవహరిస్తున్నారు. ఇండియా అండర్ 19 జట్టును ముందుండి నడిపిస్తు.. ఎంతోమంది యువ ఆటగాళ్లను  టీమిండియా జట్టుకు అందిస్తున్నారు రాహుల్ ద్రవిడ్. టీం ఇండియాలో ఉన్న ఎంతో మంది యువ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన వారే.

 


 లాల్ బహదూర్ శాస్త్రి మరణం : 1904 అక్టోబర్ 2 న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశ రెండవ ప్రధాని పదవీ బాధ్యతలు నిర్వర్తించారు . స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు లాల్ బహుదూర్ శాస్త్రి. జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక  నాయకుడిగా... మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడుగా లాల్ బహదూర్ శాస్త్రి వ్యవహరించారు. భారత దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సారి నెహ్రూ క్యాబినెట్ లో  రైల్వే శాఖ మంత్రిగా ఉండగా... ఆ తర్వాత భారతదేశపు రెండవ ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే  నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఇప్పటికీ ఈ నినాదం  ప్రజల్లో  వినిపిస్తూనే ఉంటుంది. ప్రజలకు  గుర్తుండిపోయింది. భారతదేశం మొదటి ప్రధానమంత్రిగా ఉన్న జవహార్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత రెండవ ప్రధానిగా  పదవీ బాధ్యతలను చేపట్టారు లాల్ బహదూర్ శాస్త్రి. భారత రెండవ ప్రధాన మంత్రి గానే కాకుండా అంతకు ముందు భారతదేశ హోం శాఖ మంత్రిగా... భారతదేశ రైల్వే శాఖ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు లాల్ బహదూర్ శాస్త్రి. 1966 జనవరి 11వ తేదీన 61 ఏళ్ల వయసులో లాల్ బహదూర్ శాస్త్రి పరమపదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: