రాజ్యాంగ బద్దమైన అత్యున్నతమైన పదవిలో ఉండి కూడా ఏమీ చేయలేని స్దితిలో ఉండిపోయినందుకు పాపం ఎంతగా కుమిలిపోతున్నారో ?  రాజకీయంగా చివరి దశలోకి వచ్చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు గురించే  ఈ కథనం.  జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన  మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత చంద్రబాబునాయుడు పరిస్ధితి చాలా దయనీయంగా మారిపోయింది. వెంకయ్య-చంద్రబాబు మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే.

 

ఉండటానికి వెంకయ్య మొదటి నుండి బిజెపిలో ఉన్నా రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్దితిపై ఆయనకు ఏనాడూ చింత లేదనే చెప్పాలి. ఎంతసేపు అనుంగు మిత్రుడు చంద్రబాబుకు ఏ విధంగా ప్రయోజనాలు కల్పించాలనే విషయం మాత్రమే వెంకయ్య ఆలోచించేవారు. సొంతపార్టీ దెబ్బతిన్నా పర్వాలేదు చంద్రబాబుకు మాత్రం ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని వెంకయ్య ఆలోచించబట్టే పార్టీ దెబ్బ తినేసిందని పార్టీ నేతలు చాలామంది బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 

ప్రస్తుత విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో  తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత  చంద్రబాబు పరిస్ధితి దయనీయంగా తయారైందో అందరూ చూస్తున్నదే.  మూడు రాజధానుల  ప్రతిపాదనకు  వ్యతిరేకంగా చంద్రబాబు ఎంతగా పోరాడుతున్నా పెద్దగా స్పందన కనబడటం లేదు.  చంద్రబాబుకు రాజధానుల గ్రామాల నుండి కానీ లేకపోతే పార్టీ నేతల నుండి కానీ ఆశించిన మద్దతు దొరకటం లేదు.

 

ప్రత్యర్ధి పార్టీ అయిపోవటంతో బిజెపి కూడా చంద్రబాబును దగ్గరకు రానీయటం లేదు. తానేమో రాజ్యాంగ బద్దమైన పదవిలో ఇరుక్కు పోవటంతో  పరోక్షంగా కూడా చంద్రబాబుకు సాయం చేయలేకపోతున్నారు. పోని కేంద్రంతో చెప్పి నొక్కిద్దామని అనుకుంటే జగనేమో వినేరకం  కాదు.  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమరావతి నుండి రాజధాని విశాఖపట్నంకు వెళ్ళిపోయేట్లే ఉంది. మొన్ననే మూడు రాజధానలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ’ఎవరికి చెప్పాలో వాళ్ళకు చెబుతా’ అని చెప్పినా జగన్ లెక్క చేయటం లేదు. దాంతో పాపం వెంకయ్య పరిస్ధితి వర్ణనాతీతంగా మారిపోయిందట. మరి ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారో ఏమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: