జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ  విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు.  విచిత్రమేమిటంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు చేసేదే కరెక్టు. అదే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చెప్పిందే వాస్తవం. మొత్తానికి తనకు చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని ఎప్పటికప్పుడు ఎల్లోమీడియా ఎండి బాహాటంగానే చెప్పేస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం నాటి చంధ్రజ్యోతి దినపత్రికలో  లోపలి పేజీల్లో ఓ కథనం అచ్చేశారు లేండి. అదేమిటంటే టిటిడిని బాదేస్తున్నారని. ఇంతకీ ఏమి చేస్తున్నారయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్ధానం నిధులను చిన్న ఆలయాల అభివృద్ధికి, అర్చకుల జీతాలకు వాడేస్తున్నారని వేమూరి వారి తెగ బాధపడిపోయారు. కామన్ గుడ్ ఫండ్ పేరుతో నిధులను ఒక్కసారిగా పెంచేశారట. టిటిడి నిధులను ఇలా వాడేయటం నిబంధనలకు విరుద్ధమట.

 

సరే ఇలా  చెత్తను పోగేసి చాలానే  రాసేశారు. ఎల్లోమీడియాకు తెలియనిది ఏమిటంటే టిటిడికి అనుబంధంగా ఉన్న దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల జీతాలు తదితరాలకు టిటిడి నిధులు వాడటం తప్పేమీ కాదని. అసలు కామన్ గుడ్ ఫండ్ ఉన్నదే  అటువంటి పనులు చేయటం కోసం. భక్తుల విరాళాలను కేవలం తిరుమలలోనే ఖర్చు చేయాల్సుండగా టిటిడి మాత్రం దుర్వినియోగం చేస్తోందని బాధపడిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఎల్లోమీడియాకు చంద్రబాబునాయుడు హయాంలో ఏం జరిగిందో తెలీదా ? నరేంద్రమోడికి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీలో చేసిన నిరసన దీక్షకు సుమారు రూ. 5 కోట్లు వాడారు. ఆ డబ్బులు టిటిడి నుండి నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న విషయం తెలీదా ? అప్పుడెందుకు చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు లేవలేదు ? ఇదే విషయాన్ని ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్లో  మాట్లాడుతూ చిన్న దేవాలయాలకు నిధులు ఇవ్వాలని టిటిడి చట్టంలోనే ఉందన్నారు. నిధులు ఇవ్వాలని నిర్ణయించటం ఇప్పటికైనా సంతోషించాలన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: