తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి.ఇప్పటి  నుంచి పావులు కదుపుతూ ప్రణాళికలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు.ఇక  అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి  పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో గెలవాలని  సంకల్పంతో ముందుకు సాగుతుంది టిఆర్ఎస్ పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తోంది. బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం తహతహలాడుతుంది. ఇకపోతే అన్ని పార్టీలు తమ తమ విజయంపై ధీమాతో ఉన్నాయి. 

 

 

 అయితే తెలంగాణ రాష్ట్రలో  జనసేన పార్టీకి చెందిన నేతలు అక్కడక్కడా లేకపోలేదు. చాలామంది నేతలు ఇప్పటికీ జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు.  అయితే ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరపు నుంచి నేతలు పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే  2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసిన రెండు చోట్లా అపజయం పాలు కావడంతో... పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర రాజకీయాల పైన దృష్టి పెట్టారు. తెలంగాణ రాజకీయాలను పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఇకపోతే తెలంగాణలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన నేతలు  పోటీచేసిన ఏ  ఒక్కరు కూడా గెలుపొందలేదు . 

 

 

 

 అయితే తాజాగా జనసేన పార్టీ  తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో ఈ నెల  22న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఆసక్తికర ప్రకటన చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణంగా పార్టీ పరంగా గ్లాసు గుర్తుతో  పోటీ చేయడం లేదని జనసేన పార్టీ అధికారికంగా తెలిపింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుమతించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న జనసేన నేతలకు పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: