చూస్తుంటే అలాగే ఉంది వ్యవహారం. అరెస్టు చేయండి...అరెస్టు చేయండి అని గడచిన కొద్ది నెలలుగా చంద్రబాబునాయుడు అనేక సందర్భాల్లో పోలీసులతో గొడవపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.  ఎలాగూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా అని పోలీసులు కూడా ఆయన కోరికను తీర్చేశారు. బుధవారం రాత్రి విజయవాడలోని బెంజిసర్కిల్లో అనుమతి లేకుండా ఆందోళన చేసినందుకు పోలీసులు చంద్రబాబు, చినబాబుతో పాటు ఐక్య కార్యాచరణ సమితి నేతలను అరెస్టు చేశారు.

 

పోలీసుల అరెస్టుతో చంద్రబాబు చిరకాల కోరిక తీరిపోయినట్లైంది.  మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.  తాను ఎన్ని మంచిపనులు చేసినా జనాలు తనకు ఓట్లేయలేదనే కోపం ఒకవైపు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన మెజారిటి ఇచ్చారనే కోపం మరోవైపు చంద్రబాబులో పేరుకుపోయింది. దాంతో  జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతి చిన్న విషయానికి  పెద్ద గొడవలే చేస్తున్నారు.

 

ఎక్కడ పర్యటించినా  పోలీసులతో గొడవ పడటం దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ సవాలు విసరటం చంద్రబాబుకు మామూలైపోయింది.  పోలీసులు తనను అరెస్టు చేస్తే జాతీయ స్ధాయిలో ప్రచారం చేయించుకోవాలన్నది చంద్రబాబు నీచపు ఆలోచన. ఇందులో భాగంగా విజయవాడలో కూడా కావాలనే బెంజిసర్కిల్లో శాంతి, భద్రతల సమస్య సృష్టించారు.

 

రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలనే డిమాండ్ తో ఐక్య కార్యాచరణ సమితి నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సులో పర్యటించాలని అనుకున్నారు. అయితే తాము ప్రయాణం చేయాల్సిన బస్సుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదు. దాంతో ఆ బస్సును పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు తీసుకున్న తర్వాత తమకు చూపితే బస్సును రిలీజ్ చేస్తామని పోలీసులు చెబితే టిడిపి నేతలు వినలేదు. మామూలు ప్యాసెంజర్లు ప్రయాణించాల్సిన బస్సులో  ఉద్యమం పేరుతో పార్టీల నేతలు ప్రయాణించటాన్ని పోలీసులు అభ్యంతరం పెట్టారు.

 

ఇదే విషయమై పోలీసులతో టిడిపి నేతలు గొడవలు పడుతునే విషయాన్ని చంద్రబాబుకు  చేరవేశారు. దాంతో  మాజీ ముఖ్యమంత్రి వెంటనే రంగంలోకి దిగేశారు. 24 గంటలూ బిజీగా ఉండే బెంజిసర్కిల్ కు చేరుకున్న చంద్రబాబు పోలీసులతో గొడవకు దిగారు. సీజ్ చేసిన బస్సులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నేతలకు చెప్పిన సమాధానాన్నే పోలీసులు చంద్రబాబుకు కూడా చెప్పారు.

 

పోలీసులు ఎంతచెప్పినా వినకుండా  వాళ్ళని నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. అంతే కాకుండా బస్సులు ఉంచిన చోటకు పాదయాత్రగా బయలుదేరారు. దాంతో చంద్రబాబుతో పాటు జేఏసి నేతలను పోలీసులు అడ్డగించినపుడు పెద్ద గొడవైంది. దాంతో  చివరకు పోలీసులు చంద్రబాబు, చినబాబుతో పాటు నేతలను అరెస్టు చేశారు. మొత్తానికి పోలీసుల అరెస్టుతో చంద్రబాబు చిరకాల కోరిక తీరిపోయినట్లైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: