తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి విచిత్రంగా తయారైంది.  చంద్రబాబునాయుడు, ఇతర నేతలను అరెస్టు చేసిన తర్వాత తీసుకెళ్ళాల్సిన బస్సు తాళాలనే టిడిపి నేతలు మాయం చేసేయటం సంచలనంగా మారింది. అంటే చంద్రబాబును అరెస్టు చేసిన బస్సును ముందకు కదలనీయకుండా టిడిపి నేతలెవరో ఏకంగా బస్సు తాళాలనే మాయం చేసేయటం  విచిత్రంగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేద్దామన్న ప్లాన్ తో  టిడిపి నేతృత్వంలో వివిధ పార్టీల నేతలతో ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటైంది. ఐకాస నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఐదు బస్సుల్లో బయలుదేరారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు  బస్సులను  నిలిపేశారు.  ప్రయాణీకులు వెళ్ళాల్సిన బస్సుల్లో ప్రత్యేకంగా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం చేయాలంటే అవసరమైన అనుమతులు తీసుకోవాలని చెప్పారు.

 

బస్సుయాత్రకు తీసుకోవాల్సిన అనుమతులన్నీ తీసుకుంటే బస్సులను రిలీజ్ చేస్తామని కూడా స్పష్టంగా  చెప్పారు. నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగిన తర్వాత చివరకు పోలీసులు బస్సులను సీజ్ చేసి తీసుకెళ్ళిపోయారు. దాంతో విషయం తెలిసిన చంద్రబాబు ఇతర నేతలతో కలిసి బెంజిసర్కిల్ చేరుకున్నారు. వెంటనే బస్సులను రిలీజ్ చేయాలంటూ పోలీసులతో గొడవ పెట్టుకోవటం, నోటికొచ్చినట్లు తిట్టి పెద్ద సీనే చేశారు.

 

మొత్తానికి చంద్రబాబుతో పాటు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. బస్సును ముందుకు పోనిద్దామని అనుకుంటే ఇగ్నీషన్ తాళాలు కనబడలేదు. దాంతో పోలీసులు ఖంగుతిన్నారు. అంటే బస్సును ముందుకెళ్ళనీయకుండా నేతలెవరో బస్సు తాళాలను ఎత్తేశారు. ట్రిఫిక్ ను స్తంబింప చేయటానికి బహుశా టిడిపి వ్యూహంలో ఇది కూడా ఓ భాగమేమో ?

 

తాళాల కోసం బస్సు డ్రైవర్ ఎంత వెతికినా ఉపయోగం లేకపోయింది.  తాళాల కోసం వెతుకులాటలోనే గంటసేపు సరిపోయింది. ఎంత వెతికినా తాళాలు కనబడటకపోవటంతో చివరకు వేరే బస్సును తెప్పించి అందరినీ తరలించారు. ప్రచారం కోసం టిడిపి నేతలు ఎంత స్ధాయికైనా దిగజారుతారనేందుకు ఇదే తాజా ఉదాహరణ.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: