2014 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏపిని సింగపూర్ లాగ తయారు చేస్తానని ఒకటే ఊదర గొట్టారు చంద్రబాబునాయుడు. సరే జనాలు ఏమాలోచించారో తెలీదు కానీ మొత్తానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమి చేశారు ? ఏపిని సింగపూర్ లాగ చేశారా ? లేకపోతే అమరావతి ప్రాంతాన్ని మాత్రమే సింగపూర్ లాగ చేద్దామని అనుకున్నారా ? రెంటికి చెడ్డ రేవడి లాగ దేన్ని కూడా సింగపూర్ లాగ చేయలేకపోయిన చంద్రబాబు చివరకు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు.

 

మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్మోహన్ రెడ్డి రెఫరెండం నిర్వహించాలని, రాజధాని మార్పుపై మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. చంద్రబాబు డిమాండ్ లో  నిజానికి అర్ధంలేదు. ఎందుకంటే  తాను గెలిస్తే గుంటూరు, విజయవాడ మధ్యే రాజధాని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎక్కడా చెప్పలేదు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రైతుల నుండి పచ్చని పొలాలను తీసుకుని నాశనం చేసి రాజధాని కడతానని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పలేదు.

 

అదే విధంగా స్విస్ చాలెంజ్ తరహాలో రాజధాని నిర్మాణం బాధ్యత మొత్తాన్ని సింగపూర్ సంస్ధలకు అప్పగిస్తానని, ఏపిని సింగపూర్ కు తాకట్టుపెడతానని ఏరోజూ చెప్పలేదు. గెలిచిన తర్వాత కొద్దిమంది కమ్మోరితో మాట్లాడుకుని తనిష్టం వచ్చినట్లు నిర్ణయం తీసేసుకున్నారు. చిరవకు రాజధానిపై అభిప్రాయ సేకరణ కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదికను కూడా లెక్క చేయలేదు.

 

శివరమాకృష్ణన్ కమిటి నివేదికలో చెప్పిందానికి పూర్తి విరుద్ధంగా నడుచుకున్న చంద్రబాబు ఇపుడు అబద్దాలు చెబుతున్నారు.  అమరావతిలోనే రాజధాని పెట్టమని శివరామకృష్ణన్ కమిటి చెప్పిందంటూ అబద్ధాలు ఎలా చెబుతున్నారో అర్ధం కావటం లేదు.  ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి తర్వాత మరోటి చేసిన చంద్రబాబు ఏమన్నా రెఫరెండం కోరారా ?

 

కనీసం అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసిపితో కూడా మాట్లాడకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అలాంటి చంద్రబాబు ఇపుడు రెఫరెండమని సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. రాజధాని మార్పు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.  అప్పట్లో తన ఏకపక్ష నిర్ణయానికి ఎవరు అధికారాలు ఇచ్చారో వాళ్ళే ఇపుడు జగన్ కు కూడా అధికారాలనిచ్చారని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: