చంద్రబాబునాయుడుకు హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సిఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  చంద్రబాబుకు నోటీసులివ్వాలని కోర్టు ఆదేశించింది.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వివేక హత్య జరిగిన విషయం తెలిసిందే.  హత్య ఘటనపై గడచిన ఏడాదిగా దర్యాప్తులు జరుగుతునే ఉన్నాయి.

 

హత్యపై దర్యాప్తు జరిపేందుకు చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ అప్పట్లో జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ సిబిఐ విచారణ కోరుతూ కోర్టులో పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లు  కోర్టు పరిశీలనలో ఉంది. ఇంతలో చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయి జగన్ సిఎం అయ్యారు.

 

వెంటనే సీన్ మారిపోయింది. చంద్రబాబు నియమించిన సిట్ బృందాన్ని రద్దు చేసిన జగన్ కొత్తగా మరో సిట్ బృందాన్ని నియమించారు. ఈ బృందం తన విచారణను స్పీడ్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి తదిరులను కూడా విచారించింది. సిట్ విచారణ స్పీడు పెరగటంతో ముందు జాగ్రత్తగా టిడిపి నేతలిద్దరూ కోర్టులో ఓ పిటీషన్ వేశారు.

 

సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని గతంలో జగన్ అండ్ కో సిబిఐ విచారణ కోరినట్లే ఇపుడు తాము కూడా సిబిఐ విచారణ కోరుతున్నట్లు పిటీషన్ వేశారు. ఎప్పుడైతే టిడిపి నేతలు సిబిఐ విచారణ కోరుతున్నారో వెంటనే ప్రభుత్వం అడ్డుకుంది. సిట్ విచారణ స్పీడుగా జరుగుతున్న కారణంగా ప్రత్యేకించి సిబిఐ విచారణ అవసరం లేదంటూ అడ్వకేట్ జనరల్  అభ్యంతరం వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది.

 

వేర్వేరు తేదీలతో నలుగురు పిటీషనర్లు సిబిఐ విచారణను కోరుతు  దాఖలు చేసిన నాలుగు పిటీషన్లను కోర్టు పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే హై కోర్టు చంద్రబాబుకు కూడా నోటీసులిచ్చింది. చివరకు ఏమని తేలుస్తుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: