ఇటువంటి రోజు ఒకటి వస్తుందని పాపం చంద్రబాబునాయుడు ఎప్పుడూ అనుకుని ఉండరు. కానీ కాలానికి ఎవరి ఆలోచనలతోను పనిలేదు కదా. అందుకనే  వచ్చి చంద్రబాబు మెడకు వచ్చి చుట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బకే ఇంకా కోలుకులేదు. అలాంటిది వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికల ఢంకా మోగింది. ఫిబ్రవరిలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో సర్పంచు ఎన్నికలు, అదే సమయంలో కాస్త అటు ఇటుగా మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి.

 

ఇక్కడే సమస్య మొదలైంది చంద్రబాబుకు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చాలా జిల్లాల్లో నేతలు పార్టీకి అంటి ముట్టనట్లుంటున్నారు.  పార్టీ కార్యక్రమాలకు పిలుపిస్తున్న స్పందిస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువ. చాలామంది నేతలు పార్టీని వదిలిపెట్టి బిజెపిలో చేరిపోయారు. మరికొందరు వైసిపిలోకి వెళ్ళారు. ఏ పార్టీలోకి వెళ్ళని నేతల్లో కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

 

పార్టీ నేతలు, కార్యకర్తలను కలుద్దామని చంద్రబాబు జిల్లాల్లో పర్యటనలు పెట్టుకున్నా వచ్చి కలుస్తున్న నేతలు కొంతమందే. ఈ పరిస్ధితుల్లో  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ తరపున పోటి చేయటానికి గట్టి నేతలు దొరుకుతారా అన్నదే అసలైన సమస్య. ఎందుకంటే ఎవరైనా పోటికి ముందుకొచ్చినా వాళ్ళను అన్నీ విధాలుగా ఆదుకునేందుకు చంద్రబాబు పెద్ద మనసు చేసుకుంటారని అనుకునేందుకు లేదు.

 

అంటే టిడిపి తరపున ఎవరైనా పోటికి రెడీ అన్నా వాళ్ళంతటా వాళ్ళుగా వైసిపిని ఎదుర్కొనే సత్తా ఉంటేనే దిగాలి. అయితే ఇప్పటికిప్పుడు వైసిపిని ఎదుర్కోవాల్సిన అవసరం చంద్రబాబు తప్ప మరో నేతకు లేనే లేదు. కాబట్టి నేతలను బరిలోకి దింపాల్సిన అవసరం, బాధ్యత చంద్రబాబుకు మాత్రమే ఉంది. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కూడా జగన్, చంద్రబాబు వాదనల్లో జనాల మద్దతు ఎవరికుందో తేలిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: