ఇటువంటి వార్తలు రాస్తున్నందుకే  జనాలు ఎల్లోమీడియా అంటున్నది.  సమాజం ఎటుపోయినా ఎవరేమైపోయినా ఎల్లీమీడియాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సామాజిక బాధ్యత కూడా లేదు. సర్వకాల సర్వావస్ధల్లోను  ఈ మీడియాకు చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడుకోవటమే ఏకైక లక్ష్యం. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే పూర్తి విరుద్ధంగా వార్తలు రాయటం, కథనాలు వండి వార్చటమే లక్ష్యంగా పనిచేయటం మామూలైపోయింది.

 

గడచిన 24 రోజులుగా మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి చేసిన దగ్గర నుండి చంద్రబాబు ఎంతలా రెచ్చిపోయి యాగీ చేస్తున్నది అందరూ చూస్తున్నదే. చంద్రబాబు చేస్తున్న గోలను చాలామంది పట్టించుకోవటం లేదని ఎల్లోమీడియాకు బాగా అర్ధమైపోయింది. అందుకనే సొంత కథనాల పేరుతో జనాలను మోసం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

 

తాజాగా ఈనాడు దినపత్రికలో రెండు విధాలుగా ప్రచురితమైన రెండు కథనాలను జనాలు చూసిన తర్వాత  చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈ మీడియా ఎంతగా పరితపిస్తోందో అందరికీ అర్ధమైపోతోంది. రాజధాని అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పన కోసం సుమారు 1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పినట్లుగానో లేకపోతే సొంత కథనాలతోనో రాశారు. కేంద్రానికి కూడా రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని అప్పట్లోనే ప్రతిపాదనలు పంపిన విషయం అందరికీ తెలిసిందే.

 

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు చేసిన మోసాలు, ఆడిన నాటకాలతో జనాలు విసిగిపోయి అధికారంలో నుండి దింపేశారు. దాంతో  చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత  జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నారు. తాజాగా అమరావతి  నిర్మాణానికి అదనంగా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటూ సొంతంగా కథనాలు అచ్చేసి వదులుతున్నారు.

 

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లోమీడియా లక్ష్యం మాత్రం ఒక్కటే అని అర్ధమైపోతోంది. అందుకనే అర్ధంలేని రాతలు రాస్తు జనాల్లో చులకనైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: