చంద్రబాబునాయుడుకు అసలు పరీక్ష ఎదురవ్వబోతున్నట్లే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా చంద్రబాబు గడచిన 25 రోజులుగా అమరావతి కేంద్రంగా ఎంత యాగీ చేస్తున్నాడో అందరూ చూస్తున్నదే. అమరావతి నుండి రాజధానిని తరలించేందుకు ఎట్టి పరిస్ధితుల్లోను వీల్లేదని చంద్రబాబు నానా గోల చేస్తున్నారు. అమరావతి గ్రామాలతో పాటు  గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఇన్ని రోజులు తిరిగిన చంద్రబాబు శనివారం  రాయలసీమ జిల్లాల్లోకి అడుగు పెడుతున్నారు.

 

సొంత జిల్లాలోని తిరుపతిలో  చంద్రబాబు సమావేశం నిర్వహించబోతున్నారు. మచిలీపట్నం, రాజమండ్రిలో ఉద్యమ ఖర్చుల కోసం జోలె పట్టినట్లే తిరుపతిలో కూడా చంద్రబాబు జోలె పడతారేమో చూడాలి. తిరుపతికి వెళుతున్నారు కాబట్టి పార్టీ నేతలతో  ఎటూ సమావేశం అవుతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  రాజధాని గోల అమరావతి గ్రామాల్లో తప్ప ఇంకేక్కడా లేదు.  ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు కావాలనే విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రిలో పర్యటించి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సిఎం సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబు పిలుపుకు స్పందించిన జనాలే లేరు. మామూలు జనాల సంగతిని పక్కన పెట్టినా కనీసం పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు.

 

సొంత జిల్లాలో కూడా తన పిలుపుకు స్పందన లేకపోవటంతో షాక్ కొట్టిన చంద్రబాబు వెంటనే తిరుపతి పర్యటన పెట్టుకున్నారు. నిజానికి అమరావతి రాజధానిగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు, టిడిపి నేతలు తప్ప మిగిలిన జనాలు పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం.

 

రాజధాని అమరావతి మనది అనే భావన చాలా జిల్లాల్లోని ప్రజల్లో కనబడలేదు. మొదటి నుండి అమరావతిని రాజధానిగా కన్నా కమ్మోరి, టిడిపి నేతల్లోని ప్రముఖుల రియల్ ఎస్టేట్ వెంచర్ గానే చంద్రబాబు తీర్చిదిద్దారు. దాంతో  చాలా జిల్లాల జనాలు రాజధానికి దూరమైపోయారు. ఈ కారణంగానే అమరావతి నుండి రాజధానిని మార్చేయచ్చని చెపితే సానుకూలంగా స్పందిచారు. మరి తిరుపతి పర్యటన వల్ల రాయలసీమలో ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: