నిరుద్యోగులకు ప్రతి రోజు ఏదొక విధంగా ఎక్కడొక చోట ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతూనే ఉన్నాయి. ఒకసారి కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతే మరోసారి రాష్ట్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ విడుదల అయ్యి నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

 

అయితే అందులో ఈ ఖాళీల భర్తీకి సంబంధించి జనవరి 10న అంటే నిన్నటి నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు మొత్తం 6,066 ఖాళీలు ఉన్నాయి. 

 

ఐటీఐ కేటగిరీకి గాను 3847 పోస్టులు, నాన్-ఐటీఐ కేటగిరీకి గాను 2219 పోస్టులు.. మొత్తం 6,066 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత... నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ కేటగిరీకి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

 

కాగా ఈ పోస్టులకు వయోపరిమితి అభ్యర్థుల వయసు 09.02.2020 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయిలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

 

మెరిట్ ఆధారంగా ఐటీఐ, నాన్-ఐటీఐ విభాగాలకు వేర్వేరుగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ పోస్టులకు ప్రక్రియ 10.01.2020 తేదీన ప్రారంభమై 09.02.2020 తేదీన ముగుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: