ఏడుపదుల వయసులో కూడా చంద్రబాబునాయుడుకు ఓ విచిత్రమైన కోరిక కలిగింది. ఫుట్ బాల్ ఆడుకోవాలని ఉందట. విషయం ఏమిటంటే ’వైసిపి 151 ఎంఎల్ఏలను తానొక్కడినే ఫుట్ బాల్ ఆడుతాను’  అంటూ రాజమండ్రిలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టటం కోసం చంద్రబాబు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రిలో  జనాలతో మాట్లాడారు.

 

సరే ఎలాగూ జగన్ కు వ్యతిరేకంగానే పర్యటన మొదలుపెట్టారు కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  అమరావతి బంగారుగుడ్లు పెట్టే బాతు లాంటిదట. అయితే చంద్రబాబు చెబుతున్న బాతు ఎప్పటికి గుడ్లు పెడుతుందో ఎవరికీ తెలీదు.  నిజానికి అమరావతి బంగారుగుడ్లు పెట్టే బాతులాంటిదే అయితే దాని అభివృద్ధి వెనుక ఇంత కుట్రలు చేయరు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుండి 34 వేల ఎకరాలు సేకరించక ముందే  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన విషయం ఇపుడు అందరికీ అర్ధమైపోయింది.

 

ఎటువంటి దురాలోచన లేకుండా ఉన్నంతలో అమరావతిని డెవలప్ చేసుంటే ఈ పాటికే  ఎంతో కొద్దిగా అభివృద్ధి జరిగుండేదనటంలో సందేహం లేదు.  కానీ చంద్రబాబు దృష్టి మొత్తం రియల్ ఎస్టేట్  పైనే ఉండటంతో  మొత్తం వ్యవహారమంతా కంపు అయిపోయింది. తన లోపాలు బయటపడిందని, తాను చేసిన ఇన్ సైడర్ మోసాలు అందరికీ తెలిసిపోయిందన్న ఉక్రోషంతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

ఇందులో భాగంగానే తనకు వయసైపోయిందని వైసిపి చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నిజానికి 70 సంవత్సరాలున్న మనిషిని వయసైపోయిందని కాక మరేమంటారు. ఆరోగ్యంగా ఉంటే ఉండచ్చు కానీ చంద్రబాబుకు వయస్సైపోయింది మాత్రం వాస్తవం. పనిలో పనిగా వయసుతో వచ్చే చాదస్తాలు కూడా పెరిగిపోయాయి. అందుకనే శివరామకృష్ణన్ కమిటి ఒకటి చెబితే తాను మరొకటి చేశాడు. పైగా కమిటి చెప్పిందే తాను చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. మాటకు పది అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు వైసిపి ఎంఎల్ఏలను ఫుట్ బాల్ ఆడుకుంటానని హెచ్చరించటమే విచిత్రంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: