అమెరికా మీద కోపంతోనే ఇరాన్ ఓ విమానాన్ని కూల్చేసిందా ? రెండు రోజులుగా వినిపిస్తున్న ఆరోపణలకు తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఆధారాలతో ఇరాన్ ఉద్దేశ్యపూర్వకంగానే ఉక్రెయిన్ ప్రయాణీకుల విమానాన్ని కూల్చేసిందనే విషయం బయటపడింది. దాంతో ఇరాన్ అంతర్జాతీయ సమాజం ముందు తలొంచుకోవాల్సొచ్చింది.

 

ఇరాన్ చేసిన ఓ తప్పు వల్ల ఏ పాపం తెలియని 176 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఓ విమానం కొద్దిసేపటిలోనే కూలిపోయిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంలో వివిధ దేశాలకు చెందిన 176 మంది మరణించారు. విమానం కూలిపోయిన ఘటనపై అంతర్జాతీయంగా ఇరాన్ పై అనేక ఆరోపణలు మొదలయ్యాయి. అయితే వాటన్నింటినీ ఇరాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది.

 

కానీ తాజాగా వెలుగు చూసిన ఘటనతో ఇరాన్ మిలిటరి వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారణ అవ్వటంతో  ఇరాన్ తలొంచుకోవాల్సి వచ్చంది. న్యూ యార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం విమానం గాలిలోకి లేచిన కొద్దిసేపటికే  ఓ మెరుపులాంటిది విమానం వైపు దూసుకుపోవటం స్పష్టంగా కనిపించింది. వెంటనే  పెద్ద పేలుడు జరగటంతో  విమానాన్ని ఏదో బలంగా ఢీ కొనటంతోనే పేలిపోయిందని అందరికీ అర్ధమైపోయింది.

 

ఇదే విషయాన్ని ఇరాన్ కూడా చివరకు అంగీకరించాల్సొచ్చింది. తమ మిలిటరీ బేస్ కు దగ్గరగా విమానం వెళ్ళటంతోనే పొరబాటున ఎస్ ఏ-15 టార్ క్షపణి ప్రయోగం జరిగిపోయిందని ఇరాన్ మిలిటరీ అధికారులు అంగీకరించారు. దాంతో  అమెరికా, కెనాడ, ఉక్రెయిన్ తో సహా చాలా దేశాలు ఇరాన్ పై మండిపోతున్నాయి.  

 

విమాన ప్రమదంలో చనిపపోయిన 176 మందిలో 63 మంది కెనాడ పౌరులే ఉన్నారు. 82 మంది ఇరాన్,  11 మంది ఉక్రెయిన్,  10 మంది స్వీడెన్ తో పాటు  అఫ్ఘానిస్తాన్, బ్రిటన్, జర్మన్ పౌరులున్నారు.   మొత్తానికి అమెరికా మీదున్న కోపంతో ఇరాన్ 176 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న విషయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: