తెలంగాణలో మునిస్పాల్ ఎన్నికల హడావిడి జోరందుకుంది. ప్రజా సమస్యలే మాకు ప్రధాన అజెండా అంటూ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని డీ కొట్టాలని చూస్తుంటే మరొక వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన వ్యుహలాతో చక్రం తిప్పుతున్నారు. ఇదిలాఉంటే పార్టీ ఆఫీసులన్నీ హడావిడిగా ఎన్నికల పండుగని తలపించేలా నాయకులతో నిండుకున్నాయి. మరో పక్క, కాంగ్రెస్, బీజేపీ, పార్టీలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీఆరెస్ కి పోటీగా బలమైన అభ్యర్ధులని రంగంలోకి దించుతున్నాయి. మరోపక్క

 

టిక్కెట్లు రానివారు నిరాశ చెందవద్దని మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తేనే టీఆరెస్ ని ఎదుర్కోగలమని అసంత్రుప్తులని శాంతింపజేస్తున్నారట. అంతేకాదు టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ తో పాటు టీడీపీ, వామపక్షాలు పార్టీల అభ్యర్ధుల నామినేషన్లు సమర్పించడానికి ఇప్పటికే గడువు ముగిసింది. గడిచిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు  అందిపుచ్చుకోవడంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం గత ఫలితాలని దృష్టిలో పెట్టుకుని బీజేపీ దూకుడు పెంచేసింది. కోదండరాం పార్టీ సైతం ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఎన్నడూ లేని విధంగా ఘోరమైన అవమానాలని ఎదుర్కొంటోంది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లోని చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో అత్యంత బలమైన పార్టీగా ఉన్న టీడీపీ పరిస్థతి ప్రస్తుతం మరింత దయనీయంగా మారిపోయింది. చివరికి మొన్నటికి మొన్న పుట్టిన టీజేఎస్ పార్టీ నుంచీ మున్సిపల్  ఎన్నికల్లో  పోటీ చేయడానికి క్యూలు కడుతుతున్నారు. కానీ టీడీపీ పార్టీ తరుపున కనీసం నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. చాలా చోట్ల నామినేషన్ల సంఖ్య సింగిల్ డిజిట్ కి పరిమితం కాగా కొన్ని చోట్ల అసలు అభ్యర్ధులే కరువయ్యి పోయారట. దాంతో ఇలాంటి పరిస్థితి టీడీపీ చరిత్రలోరాలేదని, ఇది చాలా ఘోరమైన అవమానమని, భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం లేదని అంటున్నారు పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: