జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్దితేంటి చివరకు ఇలాగైపోయింది ? అత్యవసరంగా మంగళగిరి నుండి శనివరం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న పవన్ చివరకు ఖాళీగా కూర్చోవాల్సొచ్చింది. అసలెందుకు అంత అర్జంటుగా ఢిల్లీకి ఎందుకు చేరుకున్నారు ?  ఎవరి అపాయింట్మెంట్  కోసం ఎదురు చూస్తున్నారు ? ఈ విషయాలు తెలీక పార్టీ నేతల్లో అయోమయం మొదలైంది. 

 

ఇంతకీ విషయం ఏమిటంటే  మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో  సీరియస్ (?) గా చర్చిస్తున్న సమయంలో ఓ ఫోన్ వచ్చింది. ఆ వచ్చిన ఫోన్ ఢిల్లీ నుండి వచ్చింది. వెంటనే  ఆ ఫోన్ అందుకున్న పవన్ పక్కకు వెళ్ళి మాట్లాడారు. వెంటనే వచ్చి మీటింగ్ ను అర్దాంతరంగా ముగించుకుని ఢిల్లీకి పరిగెత్తారు. తనతో పాటు సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ను కూడా తీసుకెళ్ళారు.

 

శనివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు కానీ ఎవరినీ కలవలేదు. ఎందుకంటే పవన్ ను పిలిపించిన వాళ్ళు అపాయిట్మంట్ ఇవ్వలేదని సమాచారం. అసలు ఎవరు పిలిపించారంటే బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా నుండి ఫోన్ వచ్చిందంటున్నారు. ఆమధ్య పవన్ మాట్లాడుతూ జనసేనను బిజెపిలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.

 

సరే పవన్ కు  కూడా పార్టీని పద్దతిగా నడిపేంత సీన్ లేదని తేలిపోయింది. ఇప్పటికే పవన్ అంటే చంద్రబాబునాయుడు జేబులోని మనిషి అని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను చిత్తుగా ఓడించారు. తెలంగాణా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేసే ధైర్యం లేక చేతులెత్తేశారు.

 

ఇక ఏపిలో ఏం చేస్తారో తెలీదు.  అందుకనే తమ పార్టీలో జనసేనను విలీనం చేసేయాలని బిజెపి నేతలు కూడా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ మరి అదే పనిగా ఢిల్లీకి పిలిపించుకుని నడ్డా ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వలేదు ? శనివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న పనవ్ ఆదివారం తెల్లవారి కూడా నడ్డాను కలవలేదని సమాచారం.  మరి అంత అర్జంటుగా పవన్ ను ఢిల్లీకి ఎందుకు పిలిపించారనేదే పెద్ద పజిల్ అయిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: