ఉత్తరాంధ్రలోని ప్రముఖ నగరమైన విశాఖపట్నాన్నే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజధానిగా చేసుకోవాలని అనుకున్నారో తెలుసా ?  జగన్ నిర్ణయం వెనుక పే....ద్ద చారిత్రక కారణం ఉంది. అదేమిటంటే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గడచిన 400 ఏళ్ళల్లో సముద్ర తీరం ఉన్న ప్రాంతాన్ని దేశం మొత్తం మీద రాజధానిగా చేసుకున్న రాష్ట్రమే లేదట. ఎప్పుడో అంటే స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషు, డచ్ వాళ్ళ పాలనలో తమిళనాడుకు చెన్నై, పశ్చిమబెంగాల్ కు కోలకత్తా మహారాష్ట్రకు ముంబాయ్ తప్ప మరే రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం రాజధానిగా ఏర్పాటు కాలేదట.

 

ఉండటానికి కర్నాటక, కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సముద్రమున్నా తీర ప్రాతం మాత్రం రాజధాని కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. చెన్నై, ముంబాయ్, కోలకత్తా లాంటి రాజధానులు శరవేగంగా అభివృద్ది చెందాయంటే సముద్ర తీరం ఆధారంగా ఏర్పడిన అనేక పరిశ్రమలు ఉండటమే ప్రధాన కారణం. సరే సముద్రతీరమంటే నష్టాలు కూడా ఉన్నాయి లేండి. కాకపోతే ఎప్పుడో ఓసారి జరిగే నష్టంతో పోల్చుకుంటే ఎప్పుడూ ఉండే ప్రయోజనాలే చాలా ఎక్కువ. ఇపుడు విశాఖలో పోర్టు బాగానే అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. దీనికి రాజధాని హోదా కూడా తోడైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.

 

అందుకే జగన్ కు ఇపుడు విశాఖను రాజధానిగా చేసుకోవాలని నిర్ణయించారు.  నిజానికి ఇప్పటికే విశాఖ నగరం బాగా డెవలప్  అయ్యిందనటంలో సందేహం లేదు. బాగా డెవలప్ అయిన సముద్రతీర  నగరాన్ని క్యాపిటల్ గా చేసుకుంటే అభివృద్ధిలో దేశంలోని ఇతర ప్రముఖ నగరాలతో పోటి పడే అవకాశాలున్నాయి.  విశాఖపట్నంలో ఉన్న వేలాది ఎకరాలను  ఫార్మా, ఐటి పరిశ్రమలకు కేటాయించచ్చు.

 

ప్రభుత్వం గనుక జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఒక్కసారిగా  విశాఖ అభివృద్ధి ఒక్కసారిగా టాప్ గేర్ లో వెళిపోతోంది. రాజధానిని చూసి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు వాటి ఫలాలను తొందరగా అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా వాస్తు ప్రకారం చూసినా అమరావతితో పోల్చుకుంటే విశాఖపట్నం నగరమే బెస్టటంటున్నారు. మరి జగన్  ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలీదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: