వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా మరోసారి తమ మార్కు కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. పాత విషయాలను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ కు చురకలు వేశారు. గతంలో పవన్ కల్యాణ్ కర్నూలును రాజధాని చేయాలన్న విషయాన్ని ప్రస్తావించారు.

 

మరి ఇప్పుడు ఏమైంది పవన్ కల్యాణ్.. గతం మరిచిపోయావా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రోజా. కర్నూలే రాజధానిగా కావాలని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ఒక్క పవన్ కల్యాణ్ నే కాదు.. అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ వాదన చేస్తున్న ప్రతి ఒక్కరిపైనా రోజా విరచుకు పడ్డారు. మొదట్లో మూడు రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టి ఆ తర్వాత మాట మార్చేసిన బీజేపీ తీరును ఆమె దుయ్యబట్టారు. రాజధానిపై బీజేపీ నేతల యూటర్న్‌ బాధాకరమన్నారు.

 

సొంత లాభం కోసం బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు రోజా. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలంతా హర్షిస్తున్నారని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాజధాని విషయంలో .. చంద్ర బాబు కావాలనే ప్రజలను రెచ్చ గొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌ పర్సన్‌ ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అంతేకాదు.. రాజధాని ప్రాంత రైతులు, ప్రజలకు నష్టం చేసింది చంద్రబాబేనని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్న సంగతి ఎలా మరచిపోతామని రోజా మండిపడ్డారు. గతంలో పంట భూములను తగులబెట్టి భయబ్రాంతులకు గురిచేశారని ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటున్న రోజా.. అసలు రాజధాని తరిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పార‌ని ప్రశ్నించారు. అంతే కాదు.. రాజకీయాల్లోకి మహిళల్ని లాగొద్దని సాక్షాత్తు జాతీయ మహిళా కమిషనే చంద్రబాబుకు చురకలు వేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: