జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. నిన్న ఆర్.ఎస్.ఎస్ నేతలతో పవన్ చర్చలు జరిపారు. ఈరోజు బీజేపీ పార్టీ నేత జేపీ నడ్డాను కలిసిన పవన్ నడ్డాతో ఏపీ మూడు రాజధానుల గురించి చర్చించారని సమాచారం. భేటీ అనంతరం తిరుగు ప్రయాణమైన పవన్ కళ్యాణ్ కాకినాడకు చేరుకోనున్నారు. 
 
జేపీ నడ్డాతో ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి, మూడు రాజధానుల గురించి, రాజధానిలో రైతుల ఆందోళన గురించి పవన్ చర్చించినట్టు సమాచారం. అతి త్వరలో బీజేపీ జనసేన కలిసి స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బీజేపీతో జనసేన పొత్తుకు దారి తీయబోతుందని తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు గురించి పవన్ జేపీ నడ్డాతో చర్చించినట్టు సమాచారం. 
 
పవన్ బీజేపీతో పొత్తుకు అంగీకరించారా...? లేదా...? అనే విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కానీ బీజేపీతో పొత్తుకు పవన్ అంగీకారం తెలిపారని వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. శనివారమే పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా మధ్య సమావేశం జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన జరగలేదు. ఈరోజు పవన్ జేపీ నడ్డా మధ్య సమావేశం జరగగా కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం పూర్తయింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి జేపీ నడ్డాకు పవన్ పూర్తిగా వివరించారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మొదటి నుండి బీజేపీ జనసేన పార్టీని విలీనం చేయాలని కోరుతూనే ఉంది. కానీ విలీనానికి పవన్ మద్దతు తెలపకపోవడంతో బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుందని సమాచారం. అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: