కొంత మందికి ఉన్న అదృష్టాన్ని వర్ణించాలంటే, అసలు మాటలు చాలవు. ఎందుకంటే దానికి సరైన సమాధానం చెప్పలేం. ఈ అదృష్టం అనేది ఎన్ని రకాలుగా తలుపు తడుతుందో ఊహించుకుంటే ఒక్కోసారి భయం వేస్తుంది. అప్పుడప్పుడు ఒళ్లు పులకరిస్తుంది. కొందరు పెట్టి పుట్టారంటారు. ఎందుకంటే మరణ సమయంలో బ్రతుకుదామని ఎంతో ఆశతో ప్రాణాలతో పోరాటం చేసినా చివరికి మట్టిలో కలిసి పోతారు.

 

 

అదే సమయంలో బ్రతుకు మీద ఆశలేని వాడు చావాలని ప్రయత్నిస్తే వాడిని ఆ మరణం ఏం చేయలేదు. మరి కొందరు చావు అంచు వరకు వెళ్లి బ్రతుకు విలువ అర్దం చేసుకునే లోపే జరగరాని దారుణం జరిగి పోతుంది. ఇంకొందరి విషయానికి వస్తే అసలు మరణం వారిని దాటుకుని వెళ్లిన వారికి మాత్రం చీమ కుట్టినంత బాధ కూడా కలుగదు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే. నిజంగా మృత్యుంజయుడు అంటే ఇంతవరకు విన్నాం ఇప్పుడు చూద్దాం.

 

 

ఈ విషయం ఇంతలా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ జరిగిన విషయం చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఇక్కడ ఒక యువకుడు మరణం అంచువరకు వెళ్లగా అది ఇతన్ని ఏం చేయలేక వదిలేసింది అనేలా ఉన్న ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లో.. ఈ వివరాలు చూస్తే నడి రోడ్దు పై వేగంగా వెల్లుతున్న ఓ బైకర్ మరో బైకును క్రాస్ చేసి వెళ్లాలని ట్రై చేసాడు కానీ అతని అంచానా తప్పి వెనకాల నుంచి ముందు బైకు నుఢీకొట్టాడు. దాంతో అతని బైక్ బ్యాలన్స్ తప్పి ఆ బైకర్ రోడ్డు మీద పడ్డాడు.

 

 

అదే సమయంలో ఆ బైక్ కు అపోజిట్‌లో వేగంగా వస్తున్న బస్సు చక్రాల కిందపడ్డాడు. కానీ ఆ బస్సు వేగానికి టైర్లు అతడి మీదకు ఎక్కకుండా పక్కకు విసిరేశాయి. దీంతో అతడు ప్రాణాలతో బతికిపోయాడు. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం చూసి అక్కడున్న వారంత ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే ఇతని అంతటి అదృష్టవంతుడు ఎక్కడో ఒక్కరు గాని ఉండరు. ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: