రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పటి నుండో అండగా ఉంటుంది అంటూ చాలా మంది తెలుగుదేశం పార్టీ విభేదించే వ్యతిరేకించే పార్టీలు చాలా కామెంట్లు చేస్తూనే ఉంటాయి. సదరు పత్రికలకు మీడియా ఛానళ్లకు ఎల్లో మీడియా ఛానల్స్ అని పేరు కూడా తెలుగు రాజకీయాల్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం అంటూ మాట్లాడిన టిడిపి పత్రిక విలేఖరికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వడం జరిగింది. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని అన్ని చోట్ల గెలిపించే విధంగా కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పని చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే పత్రికకి మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

 

గతంలో ఇదే పత్రిక కేటీఆర్ పై రకరకాల కథనాలు ప్రచురించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ‘సీఎంగా పట్టాభిషేకం’ ఎప్పుడూ అని కేటీఆర్ ను సదరు పత్రిక జర్నలిస్టు ప్రశ్నించాడు. దానికి కేటీఆర్ కూడా దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘మీ టీడీపీ పత్రికే నేను సీఎం కాబోతున్నానని రాసి ఇబ్బంది పెట్టింది. నాకైతే తెలియదు.. మీకే తెలియాలి.. ముహూర్తాలు తేదీలు మీరే నిర్ణయించి ప్రచురిస్తారు.. సీఎం ఎప్పుడవుతానో కూడా మీరే చెబితే సరిపోతుంది’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో సదురు జర్నలిస్టు కు మైండ్ బ్లాంక్ అయినంత పని అయిపోయిందట.

 

తర్వాత ఆ పత్రిక విలేఖరి ఏం మాట్లాడలేక మీ పార్టీలో ఉన్న మంత్రులందరూ భవిష్యత్తు ముఖ్య మంత్రి కేటీఆర్ పండు కామెంటు చేస్తున్నారని వెంటనే అడగటంతో దానికి కేటీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ మంత్రులు కూడా మీలాంటి జర్నలిస్టులు ప్రశ్నలువేసిన సందర్భంలోనే స్పందించారు. ఎవరు కూడా పార్టీపరంగా మాట్లాడలేదు వ్యక్తిగతంగా వారికున్న అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: