30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో బాగా పాపులర్ అయిన హాస్య నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్. గత ఎన్నికల్లో వైసిపి పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వి రాజ్ గౌరవించదగ్గ పదవిని దక్కించుకున్నారు. అయితే, రెండు రోజుల నుండి ఇతను ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మొదటగా అతను అమరావతి రైతుల గురించి అమర్యాదకరంగా మాట్లాడి తప్పు చేశారని, ఆ తర్వాత ఒక ఉద్యోగినితో ఆ టైపు మాటలు మాట్లాడిన ఆడియో టైపు వెలుగులోకి రావడంతో.. 'అడ్డంగా దొరికిపోయిన పృథ్వి' అంటూ అనేక వార్తలు వెల్లువెత్తాయి. మరుసటి రోజు అనగా నిన్న పృథ్వి రాజ్ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలా కేవలం మూడు రోజుల్లోనే అతని రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.



ఇదిలా ఉంటే, నెటిజన్ల గతంలో సృజన ఆడియో టేప్ ని ఎలా యూస్ చేసుకున్నారో.. అదే తరహాలో పృథ్వీ రాజ్ ఆడియో టేప్ ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సినిమాల్లో పృథ్వీరాజ్ నటించినటువంటి సన్నివేశాలలో 'నువ్వంటే నాకిష్టం. లవ్ యు. వెనుక నుంచి వచ్చి గట్టిగ పట్టుకుందామనుకున్న కానీ కెవ్వుమని అరుస్తావేమోనని భయమేసి ఆగిపోయా'అనే డైలాగ్ ని ఇంసెర్ట్ చేసి ఆ వీడియో క్లిప్ లను నెట్టింట షేర్ చేస్తున్నారు నెటిజన్లు.


అయితే తనకు ఒక కుటుంబం ఉందని, భార్య, పిల్లలున్నారని పృథ్వి రాజ్ తన బాధను వ్యక్తం చేస్తున్నా.. నెటిజన్లు మాత్రం కనికరించకుండా మీమ్స్ క్రియేట్ చేసి ఆటపట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే సైలెంట్ గా ఉంటే ఎట్లా మనం కూడా ఏదో ఒక సెటైర్ వేద్దామనుకుందేమో కానీ.. శ్రీ రెడ్డి కూడా తన ఫేసుబుక్ ఖాతాలో పృథ్వి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె తన పోస్ట్ లో ఏం రాసిందంటే.. ' అమ్మ దీననమ్మ బత్తాయో... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్.. ఏంటి ఆ కాల్ రికార్డ్’ అంటూ పంచ్ విసిరింది.

https://mobile.twitter.com/reyPANDUga/status/1216305116808003584

అయితే, ప్రస్తుతం ఫేసుబుక్ లైవ్ లో మాట్లాడుతున్న శ్రీ రెడ్డి వైసిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన లం-కొ-క భాషను సమర్థిస్తుంది. కానీ పృథ్వీరాజ్ ని మాత్రం.. 'చిత్తకార్తె కుక్క పెళ్ళాం ఉంచుకొని.. ఎవరితో పడితే వారితో అది చేయాలని కక్కుర్తిపడి వైసీపీ పార్టీకి తలవంపులు తెచ్చాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నా మద్దతు.. పృథ్వీరాజ్ కు మాత్రం నా చెప్పు దెబ్బ' అంటూ అనేక బూతులు తిట్టేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: