తొందరలో స్ధానిక సంస్దలకు ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ స్ధానిక  సంస్ధల ఎన్నికలంటే ఎంపిటిసి, జడ్పిటిసి మాత్రమే సుమా. పై రెండు క్యాటగరిలలో పోటి చేయదలచుకున్న వారు పాటించాల్సిన నిబంధనలు కొన్నుంటాయి. అవేంటో తెలుసా ? ఎన్నికల సంఘం రూపొందించిన నియమ, నిబంధనల ప్రకారం ప్రధనంగా అభ్యర్ధులకు ఇద్దరికన్నా పల్లలు ఉండకూడదు.

 

1995 మే 31 తర్వాత ఇద్దరి పిల్లలకన్నా ఎక్కువ సంతానం కలిగున్న వాళ్ళు పోటికి అనర్హులే. ఎంపిటిసి ఎన్నికల విషయానికి వస్తే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే మండలంలో ఎక్కడైనా సరే ఓటుహక్కు కలిగుండాలి. మండల పరిధిలోని ఏ గ్రామంలో ఓటరయున్నా పర్వాలేదు ఎంపిటిసిగా  పోటి చేయచ్చు.

 

ఇక జడ్పిటిసిగా పోటీ చేయదలచుకున్న అభ్యర్ధులు జిల్లాలోని ఏదో ఓ చోట ఓటరుగా నమోదై ఉండాలి.  ఎక్కడ ఓటరుగా నమోదు చేయించుకున్న జిల్లాలోని ఎక్కడనుండైనా పోటి చేయచ్చు. అయితే ఎంపిటిసి, జడ్పిటిసిలుగా పోటి చేయదలచుకున్న వాళ్ళు కేవలం ఒక్కచోట నుండి మాత్రమే పోటి చేయగలరు. పోటి చేసే నాటికి అభ్యర్ధికి కచ్చితంగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

 

పోటి చేయదలచుకున్న వారు నాలుగు సెట్లకు మించి వేయకూడదు. గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, డైరెక్టర్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళకు పోటి చేసే అవకాశం లేదు. అలాగే లంచాల కేసులో పట్టుబడి శిక్షను అనుభవించిన వాళ్ళు,  అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, విధుల నుండి తప్పించిన ఉద్యోగులు ఐదేళ్ళ వరకూ పోటి చేసేందుకు అనర్హులే.

 

అలాగే వివిధ నేరాల్లో జైలు శిక్షలు అనుభవించిన ఐదేళ్ళ లోపు పోటి చేయటానికి అనర్హులే. మానసిక స్ధితి సరిగా లేని వాళ్ళు కూడా పోటి చేసేందుకు లేదు. ఇక రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటి చేసే వాళ్ళు తమ రిజర్వేషన్ ధృవపత్రాలను సబ్మిట్ చేయాల్సుంటుంది. గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటి చేసే వారు కచ్చితంగా బిఫారం అందించాల్సుంటుంది. జడ్పిటిసిగా  జనరల్ సీట్లలో పోటి చేసే  వాళ్ళు డిపాజిట్ గా రూ. 5 వేలు, ఎంపిటిసిలకు రూ. 2500 చెల్లించాలి. అయితే రిజర్వుడు అభ్యర్ధులు మాత్రం జడ్పటిసిలుగా రూ. 2500, ఎంపిటిసిలైతే రూ. 1250 చెల్లించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: