తెలుగు రాష్ట్రాలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాయి.  జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలను వరసగా ప్రవేశపెట్టడంతో పాటుగా, ఉద్యోగుల విషయాల్లో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ఉదాహరణకు ఆర్టీసీ ఉద్యోగులు.  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.  జనవరి 1 వ తేదీ నుంచి ఆర్టీసీ ప్రభుత్వరంగ సంస్థగా మారిపోయింది.  ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.  అయితే, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విషయంలో చాలా గందరగోళం నెలకొన్నది.  


జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో రగడ ప్రారంభం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని చేసినట్టుగానే తమను ఆర్టీసీలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలు, సమ్మె చేశారు.  దాదాపుగా 52 రోజులపాటు ఉద్యోగులు ధర్నా, సమ్మెలు చేశారు.  కేసీర్ ఆ సమ్మెను తన తెలివితో అణిచివేశారు.  కాగా, ఇప్పుడు అమరావతి విషయంలో జగన్ కూడా ఇదే బాటలో పయనించబోతున్నారని వినికిడి.  


సమ్మె ప్రభావం కొన్ని రోజులే అని, ఆ తరువాత అలాంటి గొడవలు ఏమి ఉండవని, మూడు రాజధానుల విధానం మంచిదే అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.  హైదరాబాద్ ఒక్కదాన్నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అన్నారు.  ఇప్పుడు ద్వితీయశ్రేణి నగరాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధం అవుతున్నామని అన్నారు కెసిఆర్.  


ఆంధ్రప్రదేశ్ అలా కాకుండా చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అందరిపై ఉన్నట్టుగా కెసిఆర్ అన్నారు.  మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చినట్టు జగన్ తెలిపారు.  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందించేలా చూస్తామని జగన్ అంటున్నారు.  కానీ, ఏపీలో రగడ మాత్రం ఆగడం లేదు.  మూడు రాజధానుల అంశంతో మూడు ప్రాంతాలుగా విడగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాయి ప్రతిపక్షాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: