ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) కేంద్రంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు అన్ని వ‌ర్గాలను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే స్పందించింది. జేఎన్‌యూకి వెళ్లి, అక్క‌డ దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌తోపాటు మరికొందరు బాధిత విద్యార్థులను దీపికాకి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చ‌ర్య‌పై కొంద‌రు దీపికాకి మ‌ద్దుతు తెల‌ప‌గా, మ‌రికొంద‌రు ఆమెను నిందిస్తున్నారు. దేశ‌ద్రోహుల‌కి బాస‌ట‌గా ఎలా నిలుస్తావు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ .. దీపికా చ‌ర్య‌ని తప్పు ప‌ట్ట‌గా, తాజాగా ప్ర‌ముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా దీపికాకి చుర‌క‌లు అంటించారు.

 


 ``రెండు కోట్ల‌కి పైగా వ‌ల‌స‌దారులు దేశంలో అక్ర‌మంగా నివ‌సిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుంది` అని రామ్‌దేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు. కొంద‌రు సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఇది దేశానికి మంచి కాద‌ని స్ప‌ష్టం చేశారు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఘ‌ట‌న‌, దీపికా ప‌రామ‌ర్శ‌పై రామ్‌దేవ్ బాబా స్పందిస్తూ `` ఏదైన విష‌యం గురించి మాట్లాడే ముందు, దేశ సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి. తెలియ‌క‌పోతే ఎవ‌రైన స‌ల‌హాదారుడిని నియ‌మించుకొని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలి` అని దీపికాకి సూచించారు.


కాగా, దేశ వినాశనాన్ని కోరుకున్నవారి పక్షాన నిలిచావంటూ బాలీవుడ్‌ నటి దీపికాపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. జేఎన్‌యూలో హింసకు సంబంధించి వామపక్షాల ముసుగు తొలిగిపోయిందని  పేర్కొన్నారు. ‘వారే దుండగుల ముఠాకు నేతృత్వం వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. యూనివర్సిటీని రాజకీయ రణరంగంగా మార్చారు’ అని ట్వీట్‌చేశారు. 

కాగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ స్పంది స్తూ.. విద్యార్థులే ప్రధాన నిందితులు కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సెమిస్ట్రర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోయిన విద్యార్థులు వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: