వైసిపి పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకుల పై చంద్రబాబు పై తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. చంద్రబాబు కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అన్ని విధాలుగా అన్ని రంగాలలో పైకి రావాలని రాజధాని వ్యవహారంలో వ్యవహరించారని...కానీ వైయస్ జగన్ మాత్రం గతంలో శ్రీకృష్ణ కమిటీ మరియు ఇతర కమిటీలు కేంద్రం సిఫార్సు చేసిన కమిటీలో మేధావులు ఇచ్చిన సూచనల మేరకు ప్రస్తుతం వికేంద్రీకరణ పేరిట రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావిస్తున్నారని వాస్తవంగా జగన్ ధర్మయుద్ధం చేస్తున్నారని..తన సామాజిక వర్గానికి చెందిన వారు దగ్గర గాని లేకపోతే వైసీపీ పార్టీ బలంగా ఉన్న చోట గాని రాజధాని పెట్టడం లేదని ఆమంచి పేర్కొన్నారు.

 

ఇదే తరుణంలో దేశంలో నేను ఉండలేను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుజనాచౌదరి పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆమంచి కృష్ణమోహన్. బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకుని అప్పు ఎగ్గొట్టి రాజకీయాలలో ఏం భయం లేకుండా వ్యవహరిస్తున్న నిన్ను చూసి ప్రజల సిగ్గు పడాలని సుజనా చౌదరి కి కౌంటర్ వేశారు ఆమంచి కృష్ణమోహన్. ఇంకా పోలవరం విషయంలో అదే విధంగా చంద్రబాబు ఎన్నికల ముందు ఓడిపోతారని భావించి పథకాల రూపంలో అనేక డబ్బులను అవినీతి సొమ్మును కూడా కట్టుకున్నారని చంద్రబాబు పరిపాలన పై ఆమంచి ఆరోపణలు చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ పేరిట రాష్ట్రంలో ప్రజా ధనం వృధా కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడుతున్నారని రాష్ట్రంలో పేదలకు సామాన్య ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి తీసుకు వస్తున్నారని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆమంచి తెలిపారు.

 

రాజధాని ప్రాంతంలో ఉద్యమం పేరిట చేస్తున్న చంద్రబాబు ఆగడాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. కేవలం ఆయన వర్గీయులు మాత్రమే రాజధాని ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నారని రాష్ట్రంలో సామాన్య ప్రజలు అంతా జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశం కరెక్ట్ అని భావిస్తున్నారని ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మీ పార్టీ 23 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎంపీ లతో  రాజీనామా చేయిస్తారా? ఆ స్థానాల్లో మేము మెజారిటీ సాధించి నిరూపించే ధైర్యం మాకు ఉంది. అదే రెఫరెండం గా తీసుకునే దమ్ము మీకు ఉందా అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. చంద్రబాబు.. నేడు భోగి పండుగ నాడు GN రావు కమిటీ రిపోర్ట్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్ట్ ని, జగన్ గారి ఫోటో లని మంటల్లో వేయటం వల్ల ఏమి జరగదు. అది విషపు సంస్కృతి. జగన్ గారి ఫోటో ప్రజల గుండెల్లో ఉంది.

 

మిమ్మల్ని మీ టీడీపీ పార్టీ ని  గత ఎన్నికల్లో ప్రజలు తగులపెట్టారు..... - అన్నారు ఆయన. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న రాజకీయ తీరుపై తాను మాత్రమే కాకుండా కాపులు కూడా బాధపడుతున్నారని హీరోలుగా ఎంతో అభిమానించిన కాపులు ప్రస్తుతం రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ వాళ్లతో వీళ్ళతో కలసి రాజకీయాలు చేయడం ఆయన రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తుంటే బాధిస్తుందని ఆమంచి చెప్పుకొచ్చాడు. సామాజికవర్గాలని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అనే ఆరోపణ ఉన్న చంద్రబాబు మీద సెన్సేషనల్ అస్త్రాన్ని జగన్ ప్రయోగించట్టు గా అయ్యింది. ఆమంచి కృష్ణ మోహన్ లాజికల్ ప్రశ్నలతో టీడీపీ కీ వారి సామాజికవర్గ డ్రామా కీ తెరదించే ధైర్యం ఉన్న వైకాపా నాయకుడు గా ఆమంచి వెలుగులోకి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: