ప్రతి ఒక్కరూ ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. కొందరు ఉంగరం చేతికి అలంకారం అని ధరిస్తే కొందరు మాత్రం రాశులను బట్టి ఉంగరాలను ధరిస్తారు. కేరళలోని ఒక ఆలయం ఉంగరం ధరిస్తే అందరికీ మంచి జరుగుతుందని కేరళవాసులు అభిప్రాయపడుతున్నారు. కేరళవాసులు కేరళ రాష్ట్రంలోని పవిత్రమొతిరం అనే ఉంగరాన్ని అన్నీ శుభాలు కలుగుతాయని నమ్ముతున్నారు. కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలోని పయ్యనూర్ గ్రామంలో సుబ్రమణ్యస్వామి ఆలయం ఉంది. 
 
ఈ ఉంగరాలను మొదట్లో దర్భతో తయారు చేసేవారు. ఆ తరువాత కాలంలో పురోహితుడు ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో ఉంగారాలను బంగారంతో తయారు చేయాలని సూచనలు చేశాడు. ఆ ఉంగరాలను పవిత్రమైన దర్భ ఆకారంలో చేయడంతో ఆ ఉంగరాలకు పవిత్రత చేకూరింది. ఈ ఉంగరాలను పయ్యనూర్ లోని కొన్ని కుటుంబాలకు చెందిన వారు మాత్రమే సంప్రదాయంగా తయారుచేస్తుంటారు. 
 
మూడు రోజుల నుండి వారం రోజుల సమయం ఒక్కో ఉంగరం తయారీకి పడుతుంది. ఈ ఉంగరాలను సంప్రదాయకతీరులో తయారు చేయాల్సి ఉంటుంది. సుషున్మ, పింగళ, ఇద అనే నాడులకు ఇందులో ఉండే మూడు గీతలు ప్రతీకగా నిలుస్తున్నాయి. జీవితాంతం మద్యం, మాంసం ముట్టకుండా ఉంగరాలను తయారు చేయాల్సి ఉంటుంది. పండితులు ఈ ఉంగరాలను ధరిస్తే మనిషి శరీరంలోని కుండలినీ శక్తికి శక్తివంతంగా మారుతుందని చెబుతున్నారు. 
 
ఈ ఉంగరాలను పయ్యనూర్ లోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన తరువాత మాత్రమే ధరించాలని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో పూజలు జరిగిన తరువాత మాత్రమే ఈ ఉంగరాలకు పవిత్రత లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఉంగరం వేలికి కుడి చేతికి మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాల్సి ఉంటుంది. 38 గ్రాముల బరువుతో ఈ ఉంగరాన్ని తయారు చేస్తారు. 4,7,9,14,18,28 గ్రాముల్లో కూడా ఈ ఉంగరాలు లభిస్తాయి. ఈ ఉంగరం ధరిస్తే మంచి జరిగిందని భక్తులు చెబుతూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: