ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ నగరంలో ప్రగతిభవన్లో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు ప్రగతి భవన్ కి తన ఎంపీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి తో కలిసి వెళ్ళటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలపై చర్చించిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్కువగా తాగు మరియు సాగునీరు సమస్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మధ్యాహ్నం సమయమున ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పార్టీకి చెందిన నాయకులతో కలిసి భోజనం చేసి తర్వాత మళ్లీ సమావేశాన్ని కొనసాగించి కృష్ణా గోదావరి వాటర్ బోర్డు కి సంబంధించిన సమస్యలపై ఎక్కువ చర్చించినట్లు ఈ సందర్భంలో ఆరుగంటల సమావేశంలో ఎక్కువగా జగన్ - కే‌సి‌ఆర్ కృష్ణా గోదావరి వాటర్ బోర్డు కి ఫోన్ కాల్ చేసి చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే తరుణంలో ఇరువురు ముఖ్యమంత్రులు తమ సీఎస్ లకు ఎవరికి వారు ఫోన్లు చేయటం గమనార్హం.

 

ఒకే రూంలో ఉండి ఇరువురు తమ సీఎస్ లతో స్వయంగా మాట్లాడి.. ముందు రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు భేటీ కావాలని ఆదేశించటం గమనార్హం. అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రా ప్రభుత్వ అధికారులు రెండు రాష్ట్రాలను సందర్శించాలని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయి మొత్తం విషయాలన్నీ చర్చించుకునే సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నట్లు ఇందుకోసం భవిష్యత్తులో అడుగులు వేయబోతున్నటు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కావడం ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: