తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కారకాలపై దృష్టి సారించింది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం కూడా విదితమే. ముఖ్య వాతావరణ కాలుష్యం, విషతుల్యమవుతున్న ఫ్యాక్టరీ వ్యర్ధాలు వంటి అనేక ప్రమాదభరితమైన కాలుష్య కారకాల పై ఉక్కు పదం మోపేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైంది.

ఈ నేపథ్యంలో  నవ్యర్ధాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ , నది ప్రవాహాలలో కాలుష్యం, ఎస్ టిపి ల నిర్మాణం, వ్యర్థజలాల శుద్దీకరణ తదితర ఆంశాలపై  జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్  కి సమర్పించవలసిన నివేదికను  జనవరి 31 నాటికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎన్ జిటి   సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి  వికాస్ రాజ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి (జలమండలి )  యం.డి  దానకిషోర్ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( పి.సి.బి) సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ , టిఎస్ ఐఐసి ఎండి  వెంకట నర్సింహా రెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  మాట్లాడుతూ.. నేషనల్  గ్రీన్ ట్రిబ్యునల్ సమర్పించవలసిన నివేదికలో, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని పొందుపరుచాలని సూచించారు.  మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అర్వింద్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం టైం బాండ్ యాక్షన్ ప్లాన్  అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు, చెత్త సేకరణ తీరును ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: