ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు నిరసనలు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని పెద్ద పెద్ద డైలాగులు వేసి ఢిల్లీ పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ పెద్దలు బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి పెద్ద ఇష్టపడనట్లు ఇటీవల వార్తలు వినపడ్డాయి. అయితే ఎట్టకేలకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం జరిగింది. మొదట ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ మరియు బిజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అవ్వాలని భావించిన పవన్ కళ్యాణ్ కి వారిద్దరి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా తో మాత్రమే పవన్ కళ్యాణ్ భేటీ అయి భవిష్యత్తులో బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు ఇదే ప్రతిపాదన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నడ్డా తో తెలిపినట్లు జనసేన పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

 

రాజకీయంగా జగన్ ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్- బిజెపితో కలసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ రెండు పార్టీలు కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం తోనే ఢిల్లీలో ఉన్న మోడీ మరియు అమిత్ షా లు రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో భేటీ విషయంలో చాలా లైట్ తీసుకున్నారని..జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫిర్యాదులు కూడా బిజెపి పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బిజెపి పార్టీ స్టాండ్ ఒక్కొక్క నాయకుడి ఒక్కో విధంగా ఉందని ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే వారే బిజెపిలో ఉండరని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

 

బిజెపి పార్టీ తో కలిసిన కేవలం అతని అరుపులు కేకలు మాత్రమే ఉంటాయని..మతపరంగా జగన్ ని ఇరుకున పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించిన...పవన్ కళ్యాణ్ రష్యా భార్య జగన్ విశ్వసించే రిలీజియన్ కావటం పవన్ కళ్యాణ్ కి మైనస్ అవుతుందని ఏ విధంగా చూసుకున్నా జనసేన- బీజేపీ కలిసిన జగన్ ని ప్రస్తుతం ఎదుర్కోవడం కష్టమే అని పవన్ కళ్యాణ్ బిజెపితో చేతులు కలపడం కేవలం జోక్ గా తీసుకోవడం తప్పా పెద్ద ఒరిగేదేమీ లేదని పవన్ కళ్యాణ్ గాని బిజెపి గాని బలపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: