మూడు రాజధానుల ఏర్పాటు, రాజధానిని విశాఖపట్నంకు తరలింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై ప్రముఖ నిర్మాత  అశ్వనీదత్ ఎంతగా నోరు పారేసుకున్నాడో అందరూ చూసిందే.  నిజానికి రాజధాని తరలింపుపై  అశ్వనీదత్  అంతగా నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. జగన్ నిర్ణయాన్ని సమర్ధించిన చిరంజీవిని తిట్టారు.  ఎస్వీబీసి మాజీ ఛైర్మన్ పృధ్విరాజ్ ను ఓ వెధవ అన్నారు. రాజధాని తరలింపును పట్టించుకోని హీరోలపైన కూడా నోరుపారేసుకున్నారు.

 

అసలు ఈ ప్రముఖ నిర్మాత అందరిపైనా ఎందుకింతగా నోరు పారేసుకుంటున్నారు ? ఎందుకంటే జగన్ నిర్ణయం వల్ల ఈయనకు వందల కోట్లలో నష్టం వచ్చిందని సమాచారం. విషయం ఏమిటంటే గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఈయనకు చాలా భూముందట. అందులో ఓ 40 ఎకరాలను విమానాశ్రయం విస్తరణ కోసం చంద్రబాబునాయుడు అడిగిందే తడవుగా ఇచ్చేశారు. మొదట్లో అక్కడే ఎక్కడో భూమికి బదులు భూమి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.

 

అయితే తర్వాత  ఏమైందో తెలీదు కానీ విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన వాళ్ళకు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో భూములివ్వాలని చంద్రబాబు డిసైడ్ చేశారు. ఈ లెక్కన నిర్మాత ఇచ్చిన 40 ఎకరాల్లో ఎకరాకు భూసమీకరణలో భాగంగా 1450 గజాల స్ధలాన్ని కేటాయించారు. అంటే ఏకమొత్తంగా రాజధాని ప్రాంతంలో నిర్మాతకు 58 వేల గజాల భూమి 12 ఎకరాలు దక్కింది.

 

అప్పటి లెక్కల ప్రకారం గజం ధర సుమారు రూ. 50 వేలు. అంటే తక్కువలో తక్కువ రూ. 290 కోట్లు. రాజధాని ప్రాంతం అభివృద్ధి జరిగేకొద్దీ నిర్మాత భూమికి ధర పెరుగుతూంటుంది.  ఈ లెక్కన ఈయన వేసుకున్న అంచనా ప్రకారం గజానికి లక్ష రూపాయలు. అంటే ఒకమాదిరి డెవలప్ అయిన తర్వాత అమ్ముకున్నా కూడా సుమారుగా రూ. 580 కోట్లు వస్తుంది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై తీసుకున్న నిర్ణయంతో ఈ నిర్మాత ఆశలు ఒక్కసారిగా కూలిపోయింది.  చివరకు మొదటికే మోసం వచ్చేట్లుంది. అందుకనే జగన్ నిర్ణయంపై నోటికొచ్చినట్లు విరుచుకుపడిపోతున్నారు. పైగా తనకు ఎవరు మద్దతు రావటం లేదని జనాలను సినీజనాలపైకి రెచ్చ గొడుతున్నారు. జగన్ నిర్ణయంతో నిర్మాత నష్టపోయిన విషయం బయటకొచ్చింది. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతముందున్నారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: