తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీల‌క‌ స‌మావేశం నిర్వ‌హించి ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా... సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంపై ప‌లువురు త‌మ‌దైన శైలిలో స్పందించారు. తాజాగా పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మయ్య ఈ స‌మావేశంపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కీలక భేటీలో రహస్యాలు ఎందుకు ? అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. 

 

ఏపీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  6 గంటలకు పైగా ఏకాంత చర్చలు చేయడంలో పారదర్శకత ఎక్కడ ఉంది అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ``పోతిరెడ్డిపాడు ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్ల నుంచి అత్యధికంగా నీటిని రాయలసీమకు తరలిస్తున్నారు. కృష్ణ బేసిన్ అవసరాలు, తెలంగాణ- ఆంధ్ర ప్రాంత చట్టబద్ధమైన, న్యాయమైన వాటా నీటిని పొందకుండానే నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు నోరు  మెదపడం లేదు. ఎందుకు ప్రశ్నించడం లేదు?` అని ప్ర‌శ్నించారు. ``ఇప్పుడు పోతిరెడ్డి పాడు హెడ్ రేగులేటర్ నుంచి 44 వేల కూసెక్ ల నుంచి 88 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచితే ఇంకా నీటిని ఎక్కువ తరలిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరగదా? ఈ విషయంలో లెక్కలతో సహా చర్చకు వస్తే నేను చ‌ర్చ‌కు రెడీ` అని చ‌ర్చ విసిరారు. 

 

ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో అధికారులు లేకుండా ఇద్దరు ముజ్యమంత్రులు చర్చలు చేయడం వెనుక అంతర్యం ఏమిటని పొన్నాల ల‌క్ష్మ‌య్య సందేహం వ్య‌క్తం చేశారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం గురించే మాట్లాడితే నీటిపారుదల కార్యదర్శులు ఎందుకు సమావేశంలో లేరు అని పొన్నాల ప్ర‌శ్నించారు. ``తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులు తమవైపు వచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఆడిన దొంగ నాటకం ఇది. వైస్సార్ మరణం తర్వాత కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైస్సార్ అభిమానులు, congress PARTY' target='_blank' title='వైస్సార్సీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు మరిచిపోవద్దు. ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఉన్న మునిసిపాలిటీలలో కొద్దో, గొప్పో ఓట్లు వస్తాయని కేసీఆర్ ఆశ పడుతూ జగన్‌తో భేటీ పెట్టించుకున్నాడు.`` అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

 

 


కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడెం సాగర్ టైల్ పాండ్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభిస్తే అప్పుడు కేసీఆర్ నానా హంగామా చేశారని పొన్నాల ల‌క్ష్మయ్య గుర్తు చేశారు. ``ఇప్పుడు గోదావరి నీటిని కృష్ణకు తరలిస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట ఇదేనా కేసీఆర్ నీతి? పోతిరెడ్డి పాడు నుంచి కృష్ణ వరద జలాలు తరలించే పోతిరెడ్డిపాడు పైన ఇదే రకంగా మాట్లాడారు. అప్పుడు కృష్ణ బేసిన్ అవసరాలు తీరాకే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు హెడ్ రేగులేటర్ ను 11 వేల కూసెక్ ల నుంచి 44 వేలకు పెంచితే నీటిని ఆంధ్ర, రాయలసీమకు దోచి పెడుతున్నారని మాట్లాడిన కేసీఆర్ ఇప్పడు 88 వేల కుసేక్లు తరలిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అంటుంటే ఎందుకు నోరు మెదపడం లేదు?`` అని నిల‌దీశారు. ``ఇదంతా కుట్ర కాదా.. తెలంగాణ అవసరాలు అన్ని తీరినాక నీటిని తరలించాలని అప్పుడు అన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లాడక పోవడానికి కారణం ఏమిటి..?`` అని పొన్నాల పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: