జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో చాలా అణుకువగా ఆచితూచి మాట్లాడతారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నాకు రాదు అంటూనే ఎక్కువగా నేను నేను అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ అసలు మ్యాటర్ గురించి మాట్లాడారని చాలామంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని విభేదించే వాళ్ళు అంటుంటారు.  ఇకపోతే ఇటీవల ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఒకసారి ఇలా గా మాట్లాడి మరొకసారి గుడ్డలూడదీసి తంతా, తాటతీస్తా, పరిగెత్తించి పరిగెత్తించి తంతా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కెమెరా ముందు సినిమా డైలాగులు చెబుతున్నట్టుగా ప్రజల మధ్య అధికార పార్టీ వైసీపీ పార్టీ నేతలపై కామెంటు చేస్తుంటారని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారని..ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నోటికి అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారని తాజాగా ఇటీవల వైసిపి పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ లపై వివరణ ఇస్తున్న సందర్భంలో పై విధంగా స్పందించారు.

 

పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని రాజకీయంగా చాలా మంది తో పోరాడి మంచి పరిపాలన అందిస్తున్న తమ నాయకుడు జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను...ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడిపై కనీసం రాజకీయాల్లో రాణించలేని ఒక సినిమా యాక్టర్ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోవడం వల్ల నోటికి ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై విమర్శించడం జరిగిందని నీ నోరు బాగుంటే నా నోరు కూడా బాగుంటుందని హైలైట్ డైలాగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వేశారు.

 

ముఖ్యంగా కాకినాడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు నానాజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తన ఇంటిపై మరియు అదే విధంగా వైసిపి పార్టీ కార్యకర్తలపై రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అన్ని విషయాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుందని రాజకీయాల్లో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడాలని పార్ట్ టైమ్ రాజకీయాలు ఇక్కడ ఎవరూ చేయటం లేదు గత 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటున్నాను...రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ భాష బాగుంటే విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు అన్నట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: