క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. స్వయంగా బావగారు కమ్ వియ్యంకుడు చంద్రబాబునాయుడేమో మూడు రాజధానుల ప్రతిపాదనపై వ్యతిరేకంగా రచ్చ చేస్తుంటే బాలకృష్ణ మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అమరావతి రాజధాని రైతుల తరపున పోరాటం చేయటం తన బాధ్యత కాదన్నట్లుగా హిందుపురం ఎంఎల్ఏ  బాలకృష్ణ వ్యవహారం నడుస్తోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కర్నూలులో హై కోర్టును రాయలసీమ జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా హై కోర్టును స్వాగతిస్తు జనాలు భారీ ర్యాలీలు నిర్వహించారు. పనిలో పనిగా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటును కూడా సానుకూలంగా ఉన్నారు. సరే ఎవరి కారణాలు ఎలాగున్నా  చంద్రబాబు మాత్రం అమరావతిని తరలించేందుకు వీల్లేదంటూ నానా అవస్తలు పడుతున్నారు.

 

జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతరేకత తెచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతు తంటాలు పడుతున్నారు. సరే జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారనేది వేరే సంగతి. ఒకవైను వియ్యింకుడు మరోవైపు అల్లుడు నారా లోకేష్ జనాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తుంటే బాలయ్య మాత్రం షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నట్లున్నారు.

 

మామూలుగానే హిందుపురం నియోజకవర్గ సమస్యలపై అధికారంలో ఉన్నపుడు బాలకృష్ణ స్పందించింది చాలా తక్కువ.  అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి అస్సలు కనిపించటం లేదు. అసలు అసెంబ్లీకి కూడా దాదాపు రావటం లేదు. ఈ పరిస్ధితుల్లో  మూడు రాజధానుల ప్రతిపాదనపై స్పందిస్తారని ఆశించటం అత్యాసే అవుతుంది.  

 

కాకపోతే కాలికి బలపం కట్టుకుని జనాలను రెచ్చగొట్టటానికి తిరుగుతున్న చంద్రబాబుకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా ఇంత వరకూ చేయకపోవటమే విచిత్రంగా ఉంది. బాలయ్య వరస చూస్తుంటే ఇటు చంద్రబాబుకు అటు జగన్ కు కూడా సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరి ఆయన వైఖరిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అర్దం కావటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: