క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం మొదలవుతోంది. రాష్ట్రం మొత్తం మీద ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అమరావతి తరలింపు మాత్రమే.  రాజధానిని  అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించాలని జగన్మోహన్ రెడ్డి  డిసైడ్ అయిపోయినట్ల. ప్రభుత్వ అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది.

 

జగన్ నిర్ణయంపై  చంద్రబాబునాయుడు ఎంతగా రచ్చ చేస్తున్నాడో అర్ధమైపోతోంది. ఇదే విషయాన్ని ఉపయోగించుకుని బిజెపి కూడా బలపడాలని ప్లాన్లు వేస్తోందట. రాజధాని తరలింపుపై నిజానికి బిజెపి నేతల్లో పెద్ద అయోమయమే కనిపిస్తోంది. కొందరు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మరికొందరు కేంద్రానికి సంబంధం లేని అంశమంటున్నారు. ఈ పరిస్ధితుల్లో కేంద్రం జోక్యాన్ని పక్కన పెట్టేసినా పార్టీ బలపడేందుకు ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారట.

 

పార్టీలోని నేతల సమాచారం ప్రకారం రాజధాని తరలింపు అంశాన్ని చంద్రబాబు, జేఏసి నేతల చేతుల్లో నుండి బిజెపి హైజాక్ చేయాలని వ్యూహాలు పన్నుతోందట. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చేరదీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిజెపి, పవన్ ఒకళ్ళ అవసరం మరొకళ్ళకుందన్నది వాస్తవం. పవన్ కు లీడర్లు, క్యాడర్ లేదు. అలాగే బిజెపికి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి ఉండే నేత లేడు. కాబట్టి ఇద్దర కలిస్తే రాష్ట్రంలో సునామి సృష్టించ వచ్చనే ఆలోచనలో ఉన్నారట. అసలు తమతో చంద్రబాబునాయుడును కూడా కలుపుకోవాలని పవన్ నడ్డాతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో నిర్ణయించింది కూడా ఇదేనట. రెండు పార్టీలు కలిసి పనిచేయాలని బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా, పవన్  స్ధూలంగా ఓ నిర్ణయానికి వచ్చారట. అంటే తొందరలోనే రెండు పార్టీలు కలిసి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఆందోళనలు లేవదీయటానికే ప్లాన్లు వేసినట్లు అనుమానంగా ఉంది.  అంటే జగన్ కు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలవాలని, అమరావతి విషయాన్ని హై జాక్ చేయాలని నిర్ణయం తీసుకోవటం వరకూ ఓకే. వాళ్ళ నిర్ణయాన్ని జనాలు ఎంత వరకూ ఆమోదిస్తారు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: