ఎల్లోమీడియా-పచ్చ నేతల బంధం ఓ పద్దతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఎవరిపైనైనా బురద చల్లలానుకుంటే ఇద్దరూ కలిసి ఓ పద్దతి ప్రకారం గబ్బు పట్టించే ప్రయత్నాలు మొదలుపెడతారు.  ముందుగా ప్రత్యర్ధులపై ఎల్లోమీడియా బురద చల్లుతుంది. వెంటనే తమ్ముళ్ళు దాన్ని ప్రచారం చేయటంలో ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టేస్తారు. లేకపోతే ముందు తమ్ముళ్ళు ఆరోపిస్తారు. వెంటనే ఎల్లోమీడియా ప్రచారం అందుకుంటుంది.  ఇదంతా ఎలాగుంటుందంటే ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండనే రకంగా తయారవుతోంది.    తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది

 

 కేసియార్-జగన్మోహన్ రెడ్డి సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే.  ఏపి  విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చింటానికే వీళ్ళద్దరు భేటి అయ్యారు.  సరే ఇద్దరి మధ్య జరిగిన సుదీర్ఘమైన చర్చలు ఏమిటో స్పష్టంగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే వీళ్ళ భేటి తర్వాత ఇద్దరు కానీ లేకపోతే ఇద్దరి తరపున మరొకరు కానీ మీడియా సమావేశం పెట్టి వివరాలు చెప్పలేదు.

 

అయితే సమావేశం అయిన మరుసటి రోజు ఎల్లోమీడియాలో ఓ కథనాన్ని అచ్చేశారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు కేసియార్ మెచ్చుకున్నారట. నిర్ణయం అమలు చేసే విషయంలో గట్టిగా ముందుకెళ్ళమని ప్రోత్సహించారట. ప్రతిపక్షాలేమనుకున్నా పట్టించుకోకుండా ముందుకెళ్ళమని ప్రోత్సహించారట. నిజానికి ఈ కథనం ఇద్దరి మధ్య ఏం జరుగుంటుందనే అంచనాతో రాసిందని అర్ధమైపోతోంది.

 

ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగిన చర్చలు వాళ్ళిద్దరూ ఏబిఎన్-ఆంధ్రజ్యోతికి చెప్పే అవకాశం లేదు. కాబట్టి రాసిందంతా సొల్లని తేలిపోతోంది. అయితే సొల్లు కథనాన్ని పట్టుకుని ఈరోజు టిడిపి నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, కిమిడి కళా వెంకట్రావు నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ప్రతిపాదన తెచ్చిన జగన్ తో పాటు ప్రోత్సహించిన కేసియార్ ను కూడా తిట్టిపోశారు.

 

ఇంకా విచిత్రమేమిటంటే ఎవరు లేకుండా ఇద్దరు సిఎంలు ఏకాంతంగా భేటి అవ్వటమేంటని కూడా ప్రశ్నించేశారు. గతంలో చంద్రబాబు ఏకాంతంగా కేసియార్, ప్రధానిమంత్రితో చర్చలు జరపటాన్ని మరచిపోయినట్లున్నారు.  వీళ్ళ భేటితో ఏపికి జరిగిన మేలేమిటో వెంటనే చెప్పేయాలట వర్లకు. నిజంగా తమ్ముళ్ళు ఎంతకైనా దిగజారిపోతారనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: