ఈ మధ్య కాలంలో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్న అప్లికేషన్లలో టిక్ టాక్ ఒకటి. కానీ కొందరు ఈ టిక్ టాక్ ను ఉపయోగించుకొని పాపులారిటీ కోసం ప్రయత్నించి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొందరు డబ్బులు సంపాదించాలని టిక్ టాక్ వీడియోలను చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం సరదా కోసం అసభ్యకర టిక్ టాక్ వీడియోలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 
 
హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఏపీ సీఎం జగన్ ను తిడుతూ టిక్ టాక్ వీడియో చేసింది. కొందరు మహిళలు మహిళ చేసిన వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మహిళకు, ఇతర మహిళలకు మధ్య గొడవ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే ఒక మహిళ ఏపీ సీఎం జగన్ పై టిక్ టాక్ వీడియో చేయటం, టిక్ టాక్ వీడియోలో అభ్యంతర వ్యాఖ్యలు చేయటం వివాదానికి కారణమైంది. 
 
టిక టాక్ చేసిన మహిళ, ఇతర మహిళల మధ్య గొడవ పెద్దది కావడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకోగా టిక్ టాక్ చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జగన్ పై అభ్యంకర కామెంట్లు చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన మహిళ పేరు స్వరూప అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశామని ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. 
 
పోలీసులు గతంలోనే ప్రముఖులపై సోషల్ మీడియాలో అభ్యంతర కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టినా అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేసినా కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ కొందరు తమ తీరు మార్చుకోక ప్రముఖులపై వీడియోలు చేస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రముఖులపై చేసే పోస్టులు, వీడియోల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: