ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ కలిసిన తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు రేపు విజయవాడలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 
 
జనసేన, బీజేపీ పార్టీలు సమావేశం కానుండడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ సమావేశం గురించే చర్చ జరుగుతోంది. ఈ సమావేశం తరువాత ప్రజా సమస్యలపై బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోరాటం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాజధానుల అంశం గురించి బీజేపీ పార్టీ స్పందించింది. రాష్ట్రంలో సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చితే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం అని కన్నా లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. 
 
బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోరాటం చేసినా, పొత్తు పెట్టుకున్నాసీఎం జగన్ కు షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ నేతలు గతంలోలా జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే అవకాశాలు ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జనసేన పొత్తు వలన ప్రస్తుతం వైసీపీకి ఎలాంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
రేపు బీజేపీ జనసేన పార్టీ నేతల సమావేశం తరువాత ఎలాంటి ప్రకటనలు వెలువడతాయో చూడాల్సి ఉంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ పార్టీలు ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటనలు వెలువడతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన పార్టీ రాష్ట్రంలో బలపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: