సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశ్చిమ గోదావరి భీమవరం పట్టణానికి చేరుకున్నారు. ప్రతియేటా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటూ వస్తారు. ఇటువంటి తరుణంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఇందుకోసమే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య వాతావరణంలో కలుస్తూ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న తగాదాలను మంచి వాతావరణంలో పరిష్కరించుకుందాం అని చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని తలసాని పేర్కొన్నారు.

 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించడం జరిగింది.  గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యటించిన సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం మారుతుందని చెప్పడం జరిగిందని దానికి తగ్గట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం మారిపోయిందని..ఇదే సందర్భంలో సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబుకి...తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందని పరోక్షంగా తలసాని కామెంట్లు చేశారు. అప్పట్లో ఎన్నికల సమయంలో కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టి తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఆయన రాజకీయాలను గుర్తుచేసుకునే ఇటీవల పరోక్షంగా చంద్రబాబుపై తలసాని కామెంట్ చేశారు.

 

అంతేకాకుండా హైదరాబాదులో ఏదో ఒక భవనం కట్టి మొత్తం హైదరాబాద్ అంతా తానే అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు మాట్లాడటం పట్ల తీవ్ర విమర్శలు కురిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ పరిపాలన చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: