ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు హైదరాబాద్ ప్రగతి భవన్ లో భేటీ కావడం జరిగింది. ఈ సందర్బంగా విభజన నేఫథ్యం లో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభేదాలను సామరస్య వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు భేటీ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇదిలా ఉండగా కేసీఆర్-జగన్ భేటీపై కాంగ్రెస్ పార్టీ వెరైటీగా స్పందించింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ అభిమానులను ఆకర్షించడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారని పిసిసి మాజీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

 

నదుల అనుసంధానం పైనే సమావేశం జరిగి ఉంటే నీటిపారుదల శాఖ కార్యదర్శులు అక్కడ ఎందుకు లేరని ఆయన అన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో.. కృష్ణా బేసిన్‌ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు 44వేల క్యూసెక్కుల నీటిని తరలించడాన్ని వ్యతిరేకించిన కేసీఆర్‌కు ఇప్పుడు 88 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామంటున్నా ఎందుకు మాట్లాడడం లేదని పొన్నాల ప్రశ్నించారు. మరోపక్క ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి తీవ్రంగా తప్పు పడుతూ ఈ కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు తెలంగాణ వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు.

 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా గాని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేని దద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ పేరు ప్రస్తావిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ వెళ్లిన సందర్భంలో...అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ పేరు ప్రస్తావనకు తీసుకువచ్చి ఓట్లు దండుకోవాలని చూశారు టీ కాంగ్రెస్ నేతలు...ప్రతి సారి ఈ విధంగా వైయస్ పేరు ఎన్నికల సమయంలో వాడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని ...వైయస్ కుటుంబ ఉసురు జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలకు చాలా గట్టిగా తగిలింది కనుమరుగైపోయింది కాంగ్రెస్.., చాలా జాగ్రత్తగా వైయస్ పేరు గురించి మాట్లాడాలని రాజకీయంగా వాడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ అభిమానులు వైయస్ గురించి టీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య చేసిన కామెంట్ల పై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: