వైసిపి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఎదుర్కోవటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటే తీవ్రంగా చాలా దారుణంగా కష్టపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన పై ప్రజలలో  వ్యతిరేకత తీసుకురావటానికి ఇసుక విధానంలో మరియు ఇంగ్లీష్ మీడియం, కులం, మతం అన్ని ప్రస్తావించిన ప్రజలలో పెద్దగా తిరుగుబాటు రాకపోవడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజధాని అమరావతి ప్రాంతం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని జగన్ ని రాజకీయంగా ఎదుర్కోవటానికి ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో కలిసి బీజేపీ పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయడానికి రెడీ అయ్యి ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా రాబోయే స్థానిక ఎన్నికలలో బిజెపి పార్టీతో కలిసి పోటీ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.

 

ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో 2019 ఎన్నికల ముందు నుండి కీలక అడుగులు వేస్తున్న నాదెండ్ల మనోహర్ ని బిజెపి పార్టీ తో పవన్ కళ్యాణ్ చేతుల కలిపాక ...వైస్సార్సీపీ పార్టీలోకి నాదెండ్ల మనోహర్ ని తీసుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు దీంతో ఇప్పటికే ఆ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాలకు జై కొడుతున్న తరుణంలో  నాదెండ్ల మనోహర్ ను కూడా తనవైపు లాక్కుంటే ఖచ్చితంగా ఏ కాకైపోయి పవన్ బీజేపీ పార్టీలో ఒంటరివాడే పోయి చివరాకరికి ఆటలో అరటిపండు అయిపోతాడని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు

 

కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ ని ఢిల్లీలో ఉన్న బిజెపి నేతలు సరిగ్గా పట్టించుకోని నేపథ్యంలో...రానురాను రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు చీ కొట్టే స్థితికి పవన్ కళ్యాణ్ రాజకీయ టైం క్లోజ్ అయ్యేటట్లు జగన్ సరికొత్త ఎత్తుగడ బ్రహ్మాస్త్రం నాదెండ్ల మనోహర్ తో వేస్తున్నట్లు వైసీపీ పార్టీలో మరియు సోషల్ మీడియాలో వినబడుతున్న టాక్. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: