జనసేనలో ఉన్న ఒకే ఒక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద సవాలే విసిరారు.  రాపాకుకు గెలిచిన దగ్గర నుండి  పవన్ తో గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించటమే ఏకైక టార్గెట్ గా పవన్ రాజకీయాలు  చేస్తున్నారు. పోనీ ఆ వ్యతిరేకించేదేదో సొంతబుద్ధితో చేస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబునాయుడు కోసమని,  చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పవన్  రెచ్చిపోతున్నారు.

 

అదే సమయంలో రాపాకేమో అసెంబ్లీలోను బయట కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో గెలవటం జనసేన నుండే గెలిచినా అసలు రాపాక వైసిపి నేతే. రాబోలు నియోజకవర్గంలో  టికెట్ ఇవ్వటం కష్టమని జగన్ చెప్పగానే జనసేనలోకి దూకి టికెట్ తెచ్చుకుని గెలిచారు లేండి.  జగన్ ను పవన్ గుడ్డిగా   వ్యతిరేకిస్తున్నట్లుగా   ఎంఎల్ఏ జగన్ ను  గుడ్డిగా సమర్ధించటం లేదు.

 

అంశాల వారీగా మాత్రమే రాపాక సిఎంను సమర్ధిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని పవన్ కూడా వ్యతిరేకించారు. కానీ అసెంబ్లీలోను, బయట రాపాక ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటాన్ని స్వాతించారు. అలాగే మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా చంద్రబాబు కోసమే పవన్ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో రాపాక మూడు రాజధానులను సమర్ధించారు.

 

ఇక చివరగా కాకినాడలో జనసేన-వైసిపి కార్యకర్తల మధ్య పెద్ద గొడవలే అవుతున్నాయి. చంద్రబాబు, పవన్ ను ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నోటికొచ్చినట్లు విమర్శించారు. దాంతో జనసైనికులు కొందరు ద్వారపూడి ఇంటిపై దాడి చేశారు. దాంతో ఎంఎల్ఏ మద్దతుదారులు ఎదురుదాడి మొదలుపెట్టి చచ్చేట్లు కొట్టారు. ఇంత గొడవ జరిగినా రాపాక అసలు ఏమాత్రం పట్టించుకోలేదు.

 

పైగా దెబ్బలు తిన్న వారిని పరామర్శించేందుకు పవన్ కాకినాడ వస్తే రాపాక అడ్రస్ లేకపోవటం సంచలనంగామారింది. అంటే తనపై యాక్షన్ తీసుకోమని ఎంఎల్ఏ పవన్ కు సవాలు విసిరినట్లే అని భావిస్తున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: