కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. ఒక అదిరిపోయే ఆఫర్ ను కేంద్రం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి కోసం అందుబాటులోకి తెచ్చింది. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు జ్యూవెలరీ షాపుకు వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో బంగారం కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గోల్డ్ బాండ్లను కూడా కొనుగోలు చేయవచ్చు. 
 
సావరిన్ గోల్డ్ బాండ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోల్డ్ బాండ్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. 8వ విడత బంగారు బాండ్ల ఇష్యూ ఈ నెల 14వ తేదీ నుండి మొదలైంది. ఆన్ లైన్ లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ ప్రక్రియలో గ్రాము బంగారం ధర 3,966 రూపాయలుగా ఉంది. నగదు రూపంలో డైరెక్ట్ గా వెళ్లి బాండ్లను కొనుగోలు చేస్తే అప్పుడు గ్రాము ధర 4,016 రూపాయలుగా ఉంటుంది.
 
సావరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తరువాత బాండ్లను వెనక్కు ఇచ్చేసి డబ్బులను తీసుకోవచ్చు. ఐదు సంవత్సరాల తరువాత అవసరం లేదని అనుకుంటే డబ్బులను విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయటం వలన చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే వడ్డీ వస్తుంది. భారతదేశ పౌరులెవరైనా బంగారం బాండ్లను కొనుగోలు చేయవచ్చు. 
 
చిన్నపిల్లల పేరుపై కూడా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. గోల్డ్ బాండ్లను ఆర్బీఐ ద్వారా భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. అందువలన మీ డబ్బుకు పూర్తి భద్రత ఉండటంతో పాటు ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయటం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. బంగారం బాండ్లను కనిష్టంగా ఒక గ్రాము నుండి గరిష్టంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ఇతర సంస్థలు, ట్రస్ట్ లు 20 కేజీల వరకు గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీసుల్లో, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ, బాండ్ల విలువకు సమానమైన మొత్తాన్ని పొందవచ్చు. మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర 41,060 రూపాయలు ఉండగా 10 గ్రాముల గోల్డ్ బాండ్ ధర 39,660 రూపాయలుగా ఉంది. అంటే 10 గ్రాములపై 1400 రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: