రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బిజెపి+జనసేన అగ్ర నేతలు ఈరోజు సమావేశం అవ్వబోతున్నారు.  మొన్నటి వరకూ బిజెపిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరకు వేరే దారిలేక ఆ పార్టీ పంచనే చేరిపోయారు. కార్యాచరణ గురించి ప్లాన్ చేసుకునేందుకు ఈరోజు సమావేశమవుతున్నారు. కార్యాచరణ అంటే ఇంకేమీ లేదండి బిజెపిలో జనసేనను విలీనం చేసేయటమే. ఒకేసారి విలీనమంటే జనాలు నవ్వుకుంటారన్న భయంతో ముందుగా  కలిసి పనిచేస్తామంటూ షుగర్ కోటింగ్ వేశారంతే.

 

ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి వరకూ జనసేనతో పొత్తులేదని ఉన్నదల్లా విలీనమే అంటూ చాలామంది కమలం నేతలు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  ప్రస్తుతానికి రెండు పార్టీలు కలిసి పనిచేయాలని మాత్రమే నిర్ణయించుకున్నా తొందరలోనే విలీనం చేయక తప్పేట్లు లేదు. ఎందుకంటే పార్టీని నడిపేంత సీన్ పవన్ కు లేదన్న విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైపోయింది.

 

అదే సమయంలో బిజెపికి నాయకత్వం ఉన్నా, కార్యకర్తలున్నా జనాలను ఆకర్షించే శక్తి గలిగిన వాళ్ళు ఆ పార్టీలో లేరన్నది వాస్తవం. అందుకనే రెండు పార్టీలు కలిసిపోతే బ్రహ్మాండం ఏదో బద్దలు కొట్టవచ్చనే భ్రమల్లో ఉన్నట్లున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, సీట్లు అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

విడివిడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి ప్రభవం చూపలేమని, ఎలాంటి ఒత్తిడి క్రియేట్ చేయలేమన్న విషయం రెండు పార్టీల నేతలకు బాగా అర్ధమైపోయింది. పోని రెండు పార్టీలు కలిస్తే ఏమన్నా ఒత్తిడి తేగలరా ? అంటే అది కూడా లేదు. కాకపోతే జగన్ పై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకునే  వ్యక్తి బిజెపికి కొత్తగా ఒకళ్ళు దొరికారని చెప్పుకోవటానికి మాత్రమే పవన్ పనికొస్తారు. కాబట్టి పొత్తులు అన్నమాటను పక్కన పెట్టేసి విలీనం చేయాలనే విషయంపైన కూడా రెండు పార్టీల నేతలు చర్చించుకుంటారని సమాచారం. ఒకటేసారి విలీనం అంటే జనాలు నవ్వుకుంటారన్న అనుమానంతోనే ముందు పొత్తులంటున్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: