జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. పవన్ కు బలగం తప్ప పార్టీకి ఇంకా బలం లేదనేది ఓ వాదన వినిపిస్తోంది. అలాగే ఆయన అడుగులు ఎటువైపు ఎప్పుడు ఎలా వెళ్తాయనేదే ఎవరికీ అర్ధం కావట్లేదు. నేడు బీజేపీ నేతలతో ఆయన సమావేశం జరుగనుంది. రాజకీయాల్లో పొత్తులు సహజమే అయినా జనసేన పార్టీ పెట్టుకున్న పొత్తులు పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఈ ఆరేళ్లలో ఆయన కాంగ్రెస్, వైసీపీ తప్ప అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసేశారు అనే కామెంట్లు వస్తున్నాయి.

 

 

2014లో పార్టీ స్థాపించిన అనంతరం ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి మద్ధతిచ్చారు. ముఖ్యంగా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు పవన్ కారణమయ్యారు. రాష్ట్రంలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తామ గెలుపుకు పవన్ కారణమని చెప్పుకున్నారు. తర్వాత రోజుల్లో వారితో కొంత విబేధాలు వచ్చాయి. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చే సమయానికి టీడీపీ, బీజేపీతో విబేధాలు వచ్చేశాయి. ఆ ఎన్నికల్లో, బీఎస్పీ, party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, సీపీఎంలతో పొత్తులు పెట్టుకున్నాడు జనసేనాని. వారికి, జనసేన సిద్ధాంతాలకు తేడా ఉండడంతో ఇప్పుడు ఆ పొత్తు లేదు. ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

 

ఇప్పటికీ టీడీపీతో అంటిపెట్టుకున్నారనే అపవాదు జనసేనాని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ స్నేహం కోసం వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి రెండు రోజులున్నా అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదు. నడ్డాను కలిసినా నామమాత్రపు చర్చలే. ఏపీ నాయకులతో చర్చించాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈరోజు విజయవాడలో జరిగే సమావేశంలో ఈ విషయంపై ఓ నిర్ణయానికి రానున్నారు. మరి.. ఈసారి బీజేపీతో పెట్టుకునే పొత్తును అయినా జనసేనాని స్థిరంగా ఉంచుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: